11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
లెనోవో భారత్ మార్కెట్‌లో తాజాగా లెనోవో ట్యాబ్ M11 (Lenovo Tab M11 Launched) ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ సన్నని మరియు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ల్యాట్‌ను తొలిసారిగా CES 2024లో ప్రదర్శించింది. తాజాగా భారత్‌లో విడుదల చేసింది. మెరుగైన డిజైన్ సహా అందుబాటు ధరలోనే విడుదల అయింది.
లెనోవో ట్యాబ్ M11 స్పెసిఫికేషన్లు..
లెనోవో ట్యాబ్ M11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1920*1200 పిక్సల్ రిజల్యూషన్ తో లాంచ్ అయింది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు డాల్బీ అట్మాస్ సపోర్టుతో విడుదల అయింది.

8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో.. :
లెనోవో ట్యాబ్ M11.. మీడియాటెక్ హీలియో G88 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. Mail G52 GPU తో జతచేయబడి ఉంటుంది. ఈ ట్యాబ్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
7040mAh బ్యాటరీతో.. :
ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్లు మరియు 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్ డేట్లు ఇస్తామని లెనోవో సంస్థ వెల్లడించింది. ఈ ట్యాబ్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 10 గంటలపాటు వీడియో సపోర్టు ఉంటుందని లెనోవో తెలిపింది.

ఎక్కడ కొనుగోలు చేయాలి ?
లెనోవో ట్యాబ్ M11.. వెనుక వైపు 13MP సింగిల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్‌ను సీఫామ్ గ్రీన్ రంగులో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.17,999 గా ఉంది. అమెజాన్ (Lenovo Tab M11 sale via Amazon) ద్వారా కొనుగోలు చేయవచ్చు.
లెనోవో ట్యాబ్ పెన్ :
లెనోవో ట్యాబ్ M11 లో గూగుల్ కిడ్స్ స్పేస్, WPS ఆఫీస్, Nebo వంటి యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌లు ట్యాబ్‌లో ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. ఈ ట్యాబ్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు లెనోవో ట్యాబ్ పెన్ కూడా కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








