11.5 అంగుళాల డిస్‌ప్లే, 8600mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్ విడుదల.. JBL స్పీకర్లు సహా కీలక ఫీచర్లు..!
లెనోవో నుంచి మిడ్ రేంజ్ లో ట్యాబ్ విడుదల అయింది. మెరుగైన ఆడియో, విజువల్ అనుభూతి కోసం ఎదురుచూసే వారికి కోసం ఈ లెనోవో ట్యాబ్ ప్లస్ (Lenovo Tab Plus Launched) భారత్ లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో JBL స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు 11.5 అంగుళాల 2k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిజైన్ పరంగాను ఈ ట్యాబ్ ప్లస్ ఆకట్టుకొనే విధంగా ఉంది.
లెనోవో ట్యాబ్ ప్లాస్ స్పెసిఫికేషన్‌లు :
ఎంటర్‌టైన్‌మెంట్ కు కోసం ఎక్కువగా ట్యాబ్ వినియోగించే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్ ప్లస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ లెనోవో ట్యాబ్ ప్లస్ 11.5 అంగుళాలు 2k TUV సర్టిఫైడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాబ్ 90Hz రీఫ్రెష్ రేట్ తో అందుబాటులోకి వచ్చింది.

ఈ లెనోవో ట్యాబ్ ప్లస్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 8600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. అయితే సింగిల్ ఛార్జింగ్ ద్వారా 12 గంటలపాటు స్ట్రీమింగ్ సమయాన్ని పొందవచ్చని సంస్థ చెబుతోంది.
ఈ ట్యాబ్ ప్లస్ మీడియాటెక్ Helio G99 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ట్యా్బ్ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ట్యాబ్ IP52 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ట్యాబ్ ద్వారా సులభంగా చదువుకొనేందుకు మరియు డిజిటల్ ఫ్రేమ్, గడియారంగా కూడా మార్చుకోవచ్చు.

ఈ ట్యాబ్లెట్ లో మెరుగైన సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. 26W స్టీరియో సౌండ్ సిస్టమ్‌తోపాటు 8 JBL Hi-Fi స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇందులో 4 మ్యాట్రిక్స్ ట్వీటర్స్, 4 ఫోర్స్ బ్యాలెన్స్‌డ్ ఊఫర్స్ ఉన్నాయి. ఇవి డీప్ బాస్‌తో కూడిన అత్యంత మెరుగైన ఆడియోను అందిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే బ్లూటూత్ స్పీకర్లుగా పనిచేస్తాయి. ఈ ట్యాబ్ ప్రత్యేకమైన యాప్ వాల్యూమ్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది.
లెనోవో ట్యాబ్ ప్లస్ ధర, సేల్ వివరాలు :
భారత్ మార్కెట్ లో లెనోవో ట్యాబ్ ప్లస్ ప్రారంభ ధర రూ.22,999 గా ఉంది. ఈ ట్యాబ్‌ను లెనోవో అధికారిక వెబ్‌సైట్ Lenovo.com, లెనోవో స్టోర్ట్‌లు సహా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం లు మరియు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








