Home
Tablets

10200mAh బ్యాటరీ, 12.7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో Lenova ట్యా్బ్లెట్‌.. సేల్‌ ప్రారంభం..!

Lenovo Yoga Tab Plus : ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ లెనోవో భారత్‌ మార్కెట్‌లో లెనోవో యోగా ట్యాబ్ ప్లస్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 12.7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 10,200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. అయితే ట్యాబ్‌ కేవలం ఒకే కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

లెనోవో యోగా ట్యాబ్‌ ప్లస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లెనోవో యోగా ట్యాబ్‌ ప్లస్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. టైడల్‌ టీల్‌ కలర్‌ లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ 12.7 అంగుళాల 3K యాంటి రిఫ్లక్షన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 900 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. TUV Rheinland సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

Lenovo yoga Tab plus

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
లెనోవో ట్యాబ్లెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు Hexagon NPU, Adreno GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని చెబుతోంది. ఈ ట్యాబ్లెట్‌ లెనోవో AI ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు AI నోట్‌, AI ట్రాన్స్‌క్రిప్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు గూగుల్‌ జెమినీ సహా మరిన్ని ఫీచర్లున్నాయి.

Lenovo yoga Tab plus

కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 13MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను కూడా అమర్చారు. ఈ లెనోవో ట్యాబ్లెట్‌ ట్యాబ్‌ పెన్‌ ప్రో, 2 ఇన్ 1 కీ బోర్డును సపోర్టు చేస్తుంది.

ఈ ట్యాబ్లెట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 10200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 11 గంటలపాటు యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌ కోసం వినియోగించుకోవచ్చని లెనోవో చెబుతోంది. ఈ లెనోవో ట్యాబ్లెట్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టు, హర్మాన్ కార్డన్‌ ట్యూనింగ్‌తో 6 స్పీకర్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ట్యాబ్లెట్‌ బ్లూటూత్‌ 5.4, వైఫై 7, USB-C ఛార్జింగ్‌ పోర్టు ఉన్నాయి.

Lenovo yoga Tab plus

లెనోవో యోగా ట్యాబ్‌ ప్లస్‌ ధర :
లోనోవో యోగా ట్యాబ్‌ ప్లస్‌ భారత్‌ మార్కెట్‌లో రూ.49999 కు విడుదల అయింది. అయితే లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.44999 కే సొంతం చేసుకోవచ్చు. లెనోవా ఇండియా వెబ్‌సైట్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఈ లెనోవో ట్యాబ్లెట్‌ కొనుగోలుతో ట్యాబ్‌ పెన్‌ ప్రో, 2 ఇన్ 1 కీ బోర్డును కూడా పొందవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ టైడల్‌ టీల్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo yoga Tab plus tablet now available for sale in india with RS5000 discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X