తక్కువ ధరకే 11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh బ్యాటరీతో ట్యాబ్లెట్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
మోటోరోలా ఇండియా భారత్ మార్కెట్లో తాజాగా మోటో ప్యాడ్ 60 నియో ట్యాబ్లెట్ ను (Moto Pad 60 Neo Tablet) లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఈ ట్యాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 7040mAh బ్యాటరీని కలిగి ఉంది. 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్టైలస్ ను కూడా సపోర్టు చేస్తుంది. మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
మోటో ప్యాడ్ 60 నియో పూర్తి వివరాలు :
ఈ మోటోరోలా ట్యాబ్లెట్ 11 అంగుళాల 2.5K IPS డిస్‌ప్లేతో విడుదల అయింది. 90Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10 పాయింట్ మల్టీ టచ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ TUV Rheninland సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
మోటో ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. Arm Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయింది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
7040mAh బ్యాటరీ, నాలుగు స్పీకర్‌లు :
కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరాను అమర్చి ఉంది. అదే ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మోటో ట్యాబ్లెట్ 20W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో నాలుగు స్పీకర్‌లను కలిగి ఉంది.
మోటో పెన్ స్టైలస్ సపోర్టు :
కనెక్టివిటీ పరంగా వైఫై 5, బ్లూటూత్ 5.2, GPS, A-GPS కెమెరాను కలిగి ఉంది. IP52 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. హాల్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, యాక్సెలిరోమీటర్ సెన్సర్ లను కలిగి ఉంది. ఈ మోటో ట్యాబ్లెట్ మోటో పెన్ స్టైలస్ ను కూడా సపోర్టు చేస్తుంది.

మోటో ప్యాడ్ 60 నియో ధర, సేల్ వివరాలు :
మోటో ప్యాడ్ 60 నియో ట్యాబ్లెట్ (Moto Pad 60 Neo Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ప్రారంభ సేల్ లో భాగంగా బ్యాంకు కార్డులు, ఇతర డీల్స్ పై రూ.12999 కే అందిస్తామని మోటోరోలా ఇండియా చెబుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ పాంటోన్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications