Home
Tablets

మోటోరోలా నుంచి మరో ట్యాబ్లెట్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, విడుదల తేదీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మోటో ప్యాడ్‌ 60 నియో ట్యాబ్లెట్‌ను (Moto Pad 60 Neo Tablet) లాంచ్ చేయనుంది. ఇటీవలే మోటో నుంచి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. అయితే త్వరలో విడుదల కానున్న మోటో ట్యాబ్లెట్ విడుదల తేదీ, స్పెసిఫికేషన్లు సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

మోటో ప్యాడ్ 60 నియో ట్యాబ్లెట్ :
ఈ మోటో ట్యాబ్లెట్‌ సెప్టెంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. మోటోరోలా ఇండియా తన X హ్యాండిల్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రొమోషనల్‌ ఫోటోలు కూడా విడుదల అయ్యాయి.

Moto Pad 60 Neo tablet set to launch on september 12 in india

ఈ ప్రొమోషనల్‌ ఫోటోల ఆధారంగా ఈ ట్యాబ్లెట్ డ్యూయల్‌ టోన్ గ్రీన్ కలర్‌ వేరియంట్‌లో కనిపించింది. ఈ ట్యాబ్లెట్‌ విడుదల అనంతరం ఈ ట్యాబ్లెట్‌ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్లెట్ 5G సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

11 అంగుళాల డిస్‌ప్లే :
మోటో ప్యాడ్ 60 నియో ట్యాబ్లెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్‌ ఆధారంగా ఈ ట్యాబ్లెట్‌ 6.9mm థిక్‌నెస్, 490 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ మోటో పెన్‌ను సపోర్టు చేస్తుంది.

మీడియాటెక్ చిప్‌సెట్, 7040mAh బ్యాటరీ :
ఈ మోటోరోలా ట్యాబ్లెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. క్రాస్‌ కంట్రోల్‌, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటి మోటోరోలా స్మార్ట్‌ కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ 68W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఛార్జర్‌, మోటో పెన్‌ను ఉచితంగానే అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

మోటో ట్యాబ్లెట్‌ మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్‌తో కూడిన క్వాడ్ స్వీకర్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మోటోరోలా ప్యాడ్ 60 నియో ట్యాబ్లెట్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ధర వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ :
ఇటీవల భారత్‌ మార్కెట్‌లో మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ విడుదల అయింది. ఈ ట్యాప్‌టాప్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 14 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. విండోస్‌ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కోసం IR కెమెరాను కలిగి ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ రెండు ప్రాసెసర్ వేరియంట్స్‌లో లాంచ్ అయింది. 16GB DDR5 ర్యామ్, 1TB SSD స్టోరేజీ సపోర్టుతో ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 225H ప్రాసెసర్‌ మరియు 32GB DDR5 ర్యామ్, 1TB SSD స్టోరేజీ సపోర్టతో ఇంటెల్ కోర్‌ అల్ట్రా 7 225 H CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంది. విండోస్‌ 11 OS పైన పనిచేస్తుంది.

మోటో బుక్‌ 60 ప్రో ల్యాప్‌టాప్‌ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 60Wh బ్యాటరీని కలిగి ఉంది. 2W డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. రూ.64990, రూ.80999 ధరల్లో అందుబాటులో ఉంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

Best Mobiles in India

English summary
Moto Pad 60 Neo tablet set to launch on september 12 in india here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X