Home
Tablets

తక్కువ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నారా.. 11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh బ్యాటరీ, 4 స్పీకర్లు..!

ప్రముఖ సంస్థ మోటోరోలా భారత్‌ మార్కెట్‌ లో గత నెలలో బడ్జెట్ ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. మోటో ప్యాడ్ 60 నియో (Moto Pad 60 Neo Tablet) పేరుతో విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ప్యాడ్ స్టైలస్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ విడుదల అయిన కేవలం నెల వ్యవధిలోనే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. మోటో ప్యాడ్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

రూ.2 వేల డిస్కౌంట్ :
మోటో ప్యాడ్‌ 60 నియో ట్యాబ్లెట్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi + 5G) వేరియంట్ ధర రూ.17999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.2 వేల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంటే రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు.

Moto Pad 60 Neo Tablet with 11 inch display and 7040mAh Battery gets Rs2000

10 శాతం అదనపు డిస్కౌంట్‌ :
ఈ మోటో ట్యాబ్లెట్‌ ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఇదే ధరకు మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌ లో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం Out Of Stock గా ఉంది. ఈ ట్యాబ్లెట్‌ ఫాంటోన్‌ గ్రీన్ కలర్‌ వేరియంట్‌ లో లభిస్తుంది.

మోటో ప్యాడ్‌ 60 నియో ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటో ప్యాడ్‌ 60 నియో ట్యాబ్లెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11 అంగుళాల 2.5K IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 10 పాయింట్‌ మల్టీ టచ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే TUV Rheninland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్‌ ప్రాసెసర్ :
ఈ ట్యాబ్లెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్ LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ మోటో ప్యాడ్ Arm Mali G57 MC2 GPU కూడా ఉంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది.

Moto Pad 60 Neo Tablet with 11 inch display and 7040mAh Battery gets Rs2000

7040mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 20W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీని కలిగి ఉంది. మోటో ప్యాడ్‌ 60 నియో ట్యాబ్లెట్ పెన్‌ స్టైలస్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

నాలుగు స్పీకర్లు :
ఈ మోటోరోలా ట్యా్బ్లెట్‌ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో నాలుగు స్పీకర్‌లను అమర్చి ఉంటుంది. Wi-Fi 5, బ్లూటూత్‌ 5.2, GPS, IP52 రేటింగ్‌ తో డస్ట్, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, హాల్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Pad 60 Neo Tablet with 11 inch display and 7040mAh Battery gets Rs2000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X