Home
Tablets

మోటో Pad 60 Pro, మోటో Book 60 డిజైన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..!

Moto Pad 60 Pro, Moto Book 60 : మోటోరోలా కంపెనీ అదిరిపోయే కొత్త టాబ్లెట్‌ను తీసుకొస్తోంది. ఈ టాబ్లెట్‌కి స్టైలస్ సపోర్ట్ కూడా ఉండబోతోంది. అంతేకాదు, మొట్టమొదటిసారిగా ల్యాప్‌టాప్‌ను కూడా ఇండియాలో లాంచ్ చేయడానికి మోటో రెడీ అయిపోయింది. ఈ విషయంపై మోటోరోలా టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయని కూడా కన్ఫర్మ్ చేశారు.

అయితే, ఆ టీజర్‌లో ఆ ప్రొడక్ట్స్ పేర్లు గానీ, మిగతా డీటెయిల్స్ గానీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రముఖ టెక్ మీడియా సంస్థలు మోటోరోలా కొత్త టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఫస్ట్ లుక్ రివీల్ చేయడం మొదలుపెట్టేశాయి. అంతేకాదు లాంచ్ డేట్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూసేయండి మరి.

Moto Pad 60 Pro and Moto Book 60 Unveiled

* Moto Pad 60 Pro, Book 60 ఫస్ట్ లుక్ (లీక్డ్)
మోటోరోలా నుంచి వస్తున్న ఈ కొత్త టాబ్లెట్ పేరు Moto Pad 60 Pro అంట. అలాగే వాళ్ల ఫస్ట్ ల్యాప్‌టాప్ పేరు మోటో Book 60 అని ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ మోటో Pad 60 Pro, మోటో బుక్ 60 రెండూ కూడా మోటారోలా ఎడ్జ్ 60 Stylus ఫోన్‌తో పాటే ఏప్రిల్ 15న లాంచ్ కాబోతున్నాయి.

ఇంకో విషయం ఏంటంటే, మోటోరోలా వాడే స్పెషల్ పాంటోన్ కలర్స్ ఈ మోటో బుక్ 60, మోటో Pad 60 Pro రెండిటిలోనూ చూడొచ్చు. అంటే కలర్స్ కూడా చాలా వెరైటీగా, స్టైలిష్‌గా ఉండబోతున్నాయి. ఇవి మనల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

* Moto Pad 60 Pro: స్టైలిష్ డిజైన్, ఫీచర్లు లీక్..
మోటో ప్యాడ్ 60 ప్రో గ్రీన్ కలర్‌లో వస్తోంది. ఇది పెద్ద డిస్‌ప్లే, సన్నని బెజెల్స్‌తో చాలా స్టైలిష్‌గా ఉంది. కుడివైపు వాల్యూమ్ బటన్స్, టాప్‌లో పవర్ బటన్, స్పీకర్ హోల్స్‌తో పాటు సిమ్ ట్రే ఉన్నాయి. 4G/5G నెట్‌వర్క్ సపోర్ట్ కన్ఫర్మ్ అయింది. వెనుకవైపు స్క్వేర్ కెమెరా సెటప్‌లో 13MP కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి.

వెనుక ప్యానెల్ టెక్స్‌చర్ డిజైన్‌తో డ్యూయల్ టోన్ ఫినిష్‌తో చాలా బాగుంటుంది. స్టైలస్ పెన్ సపోర్ట్ కూడా ఉంది, రాయడానికి, గీయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని వల్ల విద్యార్థులతో పాటు ఇంకా వివిధ రకాల హార్ట్ వర్క్ చేసే వారికి ఇది ఎంతో బాగా సరిపోతుంది.

* లెనోవో ట్యాబ్ రీబ్రాండెడ్ వెర్షనా..
మోటో ప్యాడ్ 60 ప్రో, లెనోవో ఐడియా ట్యాబ్ ప్రోకి రీబ్రాండెడ్ వెర్షన్ అని టాక్. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో స్టార్టింగ్ ధర రూ.27,999. మోటో ప్యాడ్ 60 ప్రో కూడా అదే ధరలో ఉండొచ్చు. ఫీచర్లు కూడా సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

* Moto Book 60: మోటోరోలా ఫస్ట్ ల్యాప్‌టాప్..
మోటో బుక్ 60 మోటోరోలా నుంచి వస్తున్న ఫస్ట్ ల్యాప్‌టాప్. ఇది గ్రీన్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ల్యాప్‌టాప్ టాప్ లిడ్‌పై మోటో సింబల్ ప్రత్యేకంగా ఉంది. ఫుల్ డిస్‌ప్లే, సన్నని బెజెల్స్‌తో ఆకట్టుకుంటుంది. ల్యాప్‌టాప్ ఎడమవైపు చాలా టైప్-C పోర్ట్‌లు, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.

కీబోర్డ్‌కి ఇరువైపులా స్పీకర్ హోల్స్, డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ 15న ధరలు, పూర్తి వివరాలు తెలుస్తాయి.

Best Mobiles in India

English summary
Moto Pad 60 Pro and Moto Book 60 Unveiled: First Look at Motorola New Tablet and Laptop
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X