12.7 అంగుళాల భారీ డిస్‌ప్లే, 10200mAh భారీ బ్యాటరీతో మోటోరోలా ట్యాబ్లెట్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ మోటోరోలా తాజాగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్‌ను (Moto Pad 60 pro Tablet) భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. డిజైన్‌తోపాటు ఈ ప్యాడ్ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు మోటో పెన్ ప్రో స్టైలస్ కూడా అందిస్తోంది. 10200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 13MP రియర్ కెమెరాను అమర్చారు. ఈ ట్యాబ్లెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ 12.7 అంగుళాల 3K (2944*1840 పిక్సల్స్) LTPS LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 144Hz రీఫ్రెష్ రేట్, 273 ppi పిక్సల్ డెన్సిటీ, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. TUV Rheinland low Blue లైట్ మరియు ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ మోటో ప్యాడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ARM MC5 GPU చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ మైక్రో SD కార్డుతో గరిష్ఠంగా 1TB స్టోరేజీని పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ రెండు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ పొందుతుందని మోటో తెలిపింది. మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 10 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్, ట్రాన్సిలేట్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.
Moto Pad 60 PRO brings together a stunning 12.7" 3K 144Hz display, Quad JBL speakers, powerful MediaTek Dimensity 8300 performance, and circle to search with Google for a tablet that's built to think and thrill.
— Motorola India (@motorolaindia) April 17, 2025
కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లతోపాటు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో JBL ఆధారిత క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. IP52 డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
మోటో ప్యాడ్ 60 ప్రో ధర, సేల్ వివరాలు :
మోటో ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999 గా ఉంది. ఏప్రిల్ 23 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








