Home
Tablets

ఈ మోటోరోలా టాబ్లెట్ పై రూ.2000 ధర తగ్గింది! కొత్త ధర, ఆఫర్ల వివరాలు

By Maheswara

మోటోరోలా సంస్థ యొక్క టాబ్లెట్ అయిన మోటో ట్యాబ్ G70 టాబ్లెట్ అధిక సామర్థ్యము కలిగిన 7700mAh బ్యాటరీతో వస్తుంది. ప్రముఖ టాబ్లెట్‌లలో ఒకటైన ఈ టాబ్లెట్ పై ఇప్పుడు ఆకస్మికంగా ధర తగ్గింపు ప్రకటించబడింది. ఈ టాబ్లెట్ వివరాలు ఏమిటి? దీని అసలు ధర ఎంత మరియు ఆఫర్ ధర ఎంత? ఇది ఏ ఇతర ఫీచర్లను ప్యాక్ చేస్తుంది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అవును, మేము ఇక్కడ మోటో ట్యాబ్ G70 టాబ్లెట్ గురించి మాట్లాడుతున్నాము. ఇటీవలే మోటోరోలా సంస్థ వరుసగా కొన్ని మోటో స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపులను ప్రకటించిన తరువాత, లెనోవో యాజమాన్యంలోని ఈ మోటోరోలా గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించిన మోటో ట్యాబ్ G70 ధరను కూడా ఇప్పుడు తగ్గించింది.

Motorola Moto Tab G70 Tablet Price Cut By Rs.2000. New Price, Sale Offers And Specifications Details.

ఈ టాబ్లెట్ ఎంత డిస్కౌంట్ పొందింది? దీనిపై ధర తగ్గింపు రూ.2,000 ప్రకటించబడింది. ఇది భారతదేశంలో జనవరి 2022 లో ధర రూ. 21,999 కి లాంచ్ చేయబడింది. ఇప్పుడు రూ. 2,000 ధర తగ్గింపు తర్వాత దీని ధర రూ. 19,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ కొత్త ధర (రూ. 19,999) మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌లో మీరు గమనించవచ్చు. కానీ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో, మోటో ట్యాబ్ G70 మోడల్ ఇప్పటికీ అదే పాత ధరకే సేల్ చేయబడుతోంది. త్వరలోనే, కొత్త ధరలను అప్‌డేట్ చేస్తారని ఆశిద్దాం.

మోటో ట్యాబ్ G70 లో ఏ యే ఫీచర్లు ఉన్నాయి? మోటోరోలా నుండి వచ్చిన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 2000 x 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 400 nits గరిష్ట ప్రకాశంతో 11-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని డిస్‌ప్లే, కంటికి రక్షణను అందించే TUV సర్టిఫికేట్‌తో రావడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం.

మోటో ట్యాబ్ G70 టాబ్లెట్ 4GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G90T ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే, ఇది 64GB స్టోరేజీ తో వస్తుంది. మీకు మరింత స్టోరేజ్ అవసరమైతే, ఈ టాబ్లెట్‌లోని మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి మీరు మెమరీని 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక ఈ టాబ్లెట్ యొక్క కెమెరా విషయానికొస్తే, మోటోరోలా నుండి వచ్చిన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 13MP సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు ఒకే 8MP సెల్ఫీ షూటర్ ఉంది. ఈ టాబ్లెట్ డాల్బీ అట్మోస్ ద్వారా ట్యూన్ చేయబడిన క్వాడ్ కెమెరా స్పీకర్లతో వస్తుంది.

ఈ మోటో టాబ్లెట్ IP52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 11 OS పై రన్ అవుతుంది. ఇది భారీ 7700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 20W ఫాస్ట్ చార్జర్ తో వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. చివరగా, ఈ టాబ్లెట్ ప్రీమియం మెటల్ డిజైన్‌తో వస్తుంది మరియు మోడర్నిస్ట్ డీల్ అనే ఒకే ఒక రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto Tab G70 Tablet Price Cut By Rs.2000. New Price, Sale Offers And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X