18.4 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా నుంచి అతిపెద్ద టాబ్లెట్..?

నోకియా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, ఈ సారి స్మార్ట్‌ఫోన్‌లు గురించి కాదు. ఓ అతిపెద్ద టాబ్లెట్ కంప్యూటర్ గురించి. HMD Global,నేతృత్వంలోని నోకియా ఓ రహస్య టాబ్లెట్ పై పనిచేస్తోందంటూ ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ GFXBench పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది.

18.4 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా నుంచి అతిపెద్ద టాబ్లెట్..?

ఏకంగా 18.4 అంగుళాల డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఈ డివైస్ మొత్తం క్వాడ్ హైడెఫినిషన్ ప్యానల్‌ను కలిగి ఉంటుందట. ఈ మిస్టీరియస్ డివైస్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్ లను కూడా సదరు వెబ్ సైట్ రివీల్ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

18.4 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా నుంచి అతిపెద్ద టాబ్లెట్..?

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ, ఆండ్రాయిడ్ 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వివరాల పై నోకియా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

English summary
Mysterious Nokia tablet with a massive 18.4-inch display spotted on GFXBench. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot