ఆపిల్ నుండి సరికొత్త 9.7 ఇంచ్ IPAD, ధర రూ. 28,000 మాత్రమే !

Posted By: ChaitanyaKumar ARK

మార్చి చివరిలో ఆపిల్ , చికాగోలో హోస్ట్ చేసిన క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఈవెంట్ లో 9.7 ఇంచ్ IPAD ను ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ తో అనౌన్స్ చేసింది. క్రమంగా ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా దేశంలోని ఆపిల్ అధికారిక రీటైల్ షాపుల ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఆ ప్రకారం, ఈరోజు 9.7 inch iPAD దేశీయ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో ప్రీ ఆర్డర్ ద్వారా 28,000 కే అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రీ ఆర్డర్ యూనిట్స్ ఏప్రిల్ 20 నుండి షిప్పింగ్ జరుగుతాయి. ఈ సరికొత్త iPad మూడు రంగులలో లభ్యం కానుంది. అనగా గోల్డ్ , స్పేస్ గ్రే మరియు సిల్వర్ రంగులలో రానుంది. కంపెనీ ఇచ్చిన ముందస్తు సమాచారం ప్రకారo, 32 GB సామర్ధ్యం కలిగిన 9.7 ఇంచ్ IPAD wifi మరియు wifi + మొబైల్ నెట్వర్క్స్ వేరియంట్లతో 28,000 మరియు 35,700 రూపాయలకు అందుబాటులో ఉండగా, 128 జి‌బి సామర్ధ్యం కలిగిన wifi మరియు wifi+ మొబైల్ నెట్వర్క్స్ వేరియంట్లతో 38,600 మరియు 46,300 రూపాయలకు రానుంది.

ఆపిల్ నుండి సరికొత్త 9.7 ఇంచ్ IPAD, ధర రూ. 28,000 మాత్రమే !

ఈ సరికొత్త ఆపిల్ iPAD 9.7 ఇంచ్ (2018) , 9.7 ఇంచ్ ఫుల్లీ లామినేటెడ్ రెటీనా డిస్ప్లే తో 2048 x 1536 pixels రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. స్క్రీన్ , ఫింగర్ ప్రింట్ రెసిస్టెoట్ ఆలియోఫోబిక్ కోటింగ్ తో ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో A10 fusion chip ను M10 motion co-processor తో పొందుపరిచారు. 32 GB, 128 gb మెమొరీ సామర్ధ్యాలతో ఈ iPAD రానుంది.

ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే

iPAD లో iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ నిక్షిప్తం కాబడి, ID fingerprint sensor కూడా కలిగి ఉండడం దీని ప్రత్యేకత . ఇక కెమరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ రేర్ కెమరా కలిగి f/2.4 aperture తో panorama మోడ్ కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమరా విషయానికి వస్తే 1.2 మెగా పిక్సెల్ HD Face Time కెమరా తో f/2.2 aperture తో ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 4g volte సపోర్ట్ చేస్తూ, డ్యూయల్ చానెల్ wifi , MIMO wireless టెక్నాలజీతో తో కూడిన HT80, బ్లూటూత్ 4.2 మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో పొందుపరచబడి ఉంటుంది. మరియు 32.4 వాట్ -hr రీఛార్జిబుల్ Li-Po battery కలిగి ఉంటుంది. ఈ బాటరీ వైఫై లో 10 గంటల ఇంటర్నెట్ బ్రౌసింగ్ , మ్యూజిక్ మరియు వీడియో ప్లేబాక్ ఇవ్వగలదని చెప్తున్నారు.

ఈ education -centric (స్టూడెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని) పై ప్రవేశ పెట్టబడిన ఈ టాబ్లెట్ కోసం కొన్ని పరికరాలు కూడా ప్రత్యేకంగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. Logitech Crayon స్టైలస్ , Rugged Keyboard case మరియు ఆపిల్ పెన్సిల్ . కాకపోతే ఈ పరికరాలు మనదేశంలో లభ్యత గురించిన వివరాలైతే లేవు. iPAD పరo గా స్టూడెంట్స్ కోసం డిస్కౌంట్ సేల్స్ నడిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.

English summary
New Apple 9.7-inch iPad goes on pre-order via Flipkart; price starts Rs. 28,000 more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot