9340mAh భారీ బ్యాటరీ, 11 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో వన్‌ప్లస్ ప్యాడ్.. కీలక వివరాలు లీక్..?
వన్‌ప్లస్ నుంచి భారత్ మార్కెట్‌లో జులై నెలలో వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన అనేక వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లు భారీ బ్యాటరీలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు వన్‌ప్లస్ నుంచి మరో నెక్‌బ్యాండ్ కూడా విడుదల కానుంది. వన్‌ప్లస్ బుల్లె్ట్స్ వైర్‌లెస్ Z3 నెక్‌బ్యాండ్ జూన్ 19 న విడుదల కానుంది.
అయితే భారత్ మార్కెట్లోకి వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన వివరాలు ఇటీవల విడుదల అయ్యాయి. ఈ ప్యాడ్ డిజైన్‌ను 91మొబైల్స్ భాగస్వామ్యంతో టిప్‌స్టర్ స్టీ్వ్ హెచ్ హెమ్మర్‌స్టాఫర్ లీక్ చేశారు.

వన్‌ప్లస్ ప్యాడ్ గో తరహాలో :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ మోడల్ ఏరో బ్లూ కలర్ వేరియంట్‌లో ఉంది. అయితే 2023 సంవత్సరంలో విడుదల అయిన వన్‌ప్లస్ ప్యాడ్ గో తరహాలో డిజైన్ ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కూడా లీక్ అయ్యాయి.
డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 11 అంగుళాల ఫుల్ HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90Hz రీఫ్రెష్ రేట్, 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులకి వచ్చే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ G100 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని కూడా సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 పైన పనిచేసే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 5MP కెమెరా, ముందువైపు 5MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 9340mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లీక్స్ ఆధారంగా ఈ ట్యాబ్లెట్ 539 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ వైఫై మరియు సెల్యూలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ భారత్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. మరియు ఎంత ధరలో అందుబాటులోకి వస్తుందనే వివరాలు కూడా తెలియలేదు. దీంతోపాటు పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
* జూన్ 19 వ తేదీన వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లైస్ Z3 నెక్‌బ్యాండ్ విడుదల కానుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 27 గంటల ప్లేప్యాక్ టైంను అందిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ సాంబా సన్‌సెట్, మాంబో మిడ్‌నైట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది.
Image credit : @ONLEAKS @91mobiles


Click it and Unblock the Notifications