12.1 అంగుళాల డిస్‌ప్లే, 9,510mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ప్యాడ్ 2 విడుదల.. ఫీచర్లు, ధర, సేల్ వివరాలు..!
వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4, ప్యాడ్ 2 సహా వన్‌ప్లస్ వాచ్ 2R, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో విడుదల అయ్యాయి. వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2 Launched) ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 3K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ప్యాడ్ 2 తోపాటు పన్‌ప్లస్ Stylo 2 మరియు స్మార్ట్ కీ బోర్డును కూడా విడుదల చేసింది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 12.1 అంగుళాల 3K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000*2120 పిక్సల్ రిజల్యూషన్ సహా 144Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ప్యాడ్ రీఫ్రెష్ రేట్ వినియోగం ఆధారంగా 30Hz నుంచి 144Hz వరకు మారుతుంటుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 750 GPU చిప్‌సెట్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ప్యా్డ్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వరకు జతచేయబడి ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్టు, 6 స్పీకర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS 14.1 పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. AI Eraser 2.0, స్మార్ట్ కటౌట్ 2.0, AI టూల్‌బాక్స్, రికార్డింగ్ సమ్మరీ మరియు స్కాన్ డాక్యుమెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2, వెనుకవైపు 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ కెమెరా ద్వారా 30fps వద్ద 4k నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాతో 30fps వద్ద 1080p నాణ్యతతో వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 9,510mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌ను 0-100 శాతం ఛార్జింగ్ చేసేందుకు 81 నిమిషాల సమయం పడుతుందని వన్‌ప్లస్ వెల్లడించింది. వన్‌ప్లస్ టచ్ ట్రాన్సిమిషన్, సెల్యూలర్ డేటా షేరింగ్, యాప్ రిలే, రిమోట్ ఫైల్ యాక్సెస్, ఓపెన్ కాన్వాస్, యాప్ ఆటో అడాప్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42999 గా ఉంది. దీంతోపాటు వన్‌ప్లస్ Stylo 3 ధర రూ.5499, వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డు ధర రూ.8499 గా ఉంది.
సేల్, డిస్కౌంట్ వివరాలు : ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 ను ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ICICI, వన్‌కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








