వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ విడుదల.. ఏకంగా 12140mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్..!
వన్‌ప్లస్ తాజాగా కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో పేరుతో (OnePlus Pad 2 Pro Tablet) విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు శక్తివంతమైన చిప్‌సెట్, భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ చైనా మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 13.2 అంగుళాల 3.4K LCD భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2400 x 3392 పిక్సల్స్ రిజల్యూషన్‌తోపాటు 315 ppi పిక్సల్ డెన్సిటీ, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

శక్తివంతమైన చిప్‌సెట్ :
వన్‌ప్లస్ కొత్త ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite శక్తివంతమైన చిప్‌సెట్‌తో విడుదల అయింది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో జత చేసి ఉంటుంది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,140mAh బ్యాటరీతో పనిచేస్తుంది. హెవీ యూజర్లకు కూడా ఈ బ్యాటరీ లైఫ్ ఆకట్టుకుంటుంది. కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ ట్యాబ్లెట్ వెనుక వైపు 13MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు 8 స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌తో స్మార్ట్ టచ్ కీ బోర్డును కూడా కలిగి ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో ధర, సేల్ వివరాలు :
చైనా మార్కెట్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర CNY 3199 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.37900) గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3499 (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.41,500) గా ఉంది.
అదే 12GB ర్యా్మ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 3799 (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.45,000), 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర CNY 3999 (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.41,500) గా ఉంది. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్ చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో విడుదలపై ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
చైనాలో వన్‌ప్లస్ 13T.. భారత్‌లో వన్‌ప్లస్ 13s :
చైనా మార్కెట్‌లో ఇటీవల విడుదల అయిన వన్‌ప్లస్ 13T స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ మార్కెట్‌లో 13s పేరుతో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. మరియు కలర్ వేరియంట్స్ వివరాలను వన్‌ప్లస్ వెల్లడించింది. వన్‌ప్లస్ 13s ఫోన్ బ్లాక్, పింక్ రంగుల్లో మాత్రమే లాంచ్ కానుంది.
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 6.32 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ లాంచ్ కానుంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








