వన్‌ప్లస్ ప్యాడ్ 2 ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్.. రేపటి సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల..!!
వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్ (OnePlus Summer Launch Event) రేపు (జులై 16) న నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 5G, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ వాచ్ 2R, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో విడుదల కానున్నాయి. అయితే విడుదలకు ముందు వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి. దీంతోపాటు వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డ్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ ట్యాబ్లెట్ బ్యాంకు ఆఫర్ల వివరాలను కూడా టిప్‌స్టర్ లీక్ చేశారు. పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 అంచనా స్పెసిఫికేషన్‌లు :
టిప్‌స్టర్ యోగేష్ వివరాల ఆధారంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 12.1 అంగుళాల 3K IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తోపాటు 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రేపు విడుదల కానున్న వన్‌ప్లస్ ట్యాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 (అండర్ ది హుడ్) చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS 14 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 13MP ప్రైమరీ కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ 67W ఛార్జింగ్ సపోర్టుతో 9,510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం 6 స్పీకర్లతో అందుబాటులోకి వస్తుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 అంచనా ధర .. :
వన్ ప్లస్ ప్యాడ్ 2 ధర వివరాలను టిప్ స్టర్ యోగేష్ బ్రార్ లీక్ చేశారు. ఈ వివరాలు ఆధారంగా ప్యాడ్ 2 ధర రూ.47,999 గా ఉండే అవకాశం ఉంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఫలితంగా ధర రూ.45,999 కి తగ్గనుంది. దీంతోపాటు వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డు ధర రూ.11,999 మరియు వన్‌ప్లస్ స్టైలో 2 ధర సుమారు రూ.5,000 గా ఉంది.
** ఇదే లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది. రెండు రోజుల క్రితం ఈ హ్యండ్‌సెట్ ఆండ్రాయిడ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఈ నార్డ్ 4 మోడల్ నాలుగు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని తెలిపింది.
దీంతోపాటు వన్‌ప్లస్ నార్డ్ 3 హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే ఎక్కువ మన్నిక వచ్చేలా నార్డ్ 4 లో మార్పులు చేసినట్లు తెలిపింది. మరియు నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ మెటల్ Unibody డిజైన్‌ను కలిగి ఉంటుందని గతంలోనే వన్‌ప్లస్ వెల్లడించింది. మరియు డ్యూయల్ టోన్ ఫినిష్‌తో అందుబాటులోకి రానుంది. అయితే గ్రే కలర్ వేరియంట్ డయాగ్నల్ లైన్ ప్యాట్రన్‌తో గ్రేడియంట్ ఫినిష్‌తో లాంచ్ కానుంది.


Click it and Unblock the Notifications








