12,140mAh బ్యాటరీ, 13.2 అంగుళాల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ ట్యాబ్లెట్..!
వన్‌ప్లస్ ఇవాళ భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌తోపాటు వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ను (OnePlus Pad 3 Tablet) అందుబాటులోకి తీసుకొచ్చింది. గత వేరియంట్స్ పోలిస్తే మెరుగైన పనితీరు, సాఫ్ట్‌వేర్‌లను కలిగి ఉంది. మరియు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. 13s ఫోన్ కూడా ఇదే చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అయితే ఈ ట్యాబ్లెట్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 13.2 అంగుళాల 3.4K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 315 PPI పిక్సల్ డెన్సిటీ, 7:5 యాస్పెక్ట్ రేషియో ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్ట్రోమ్ బ్లూ, ప్రాస్టెడ్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 ను కలిగి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.
92 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,140mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ 1-100 శాతం ఛార్జింగ్‌ను 92 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అదే ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 6 గంటల వరకు గేమింగ్ లేదా 15 కంటే ఎక్కువ గంటలపాటు షార్ట్ వీడియో ప్లేబ్యాక్ లేదా 17 గంటల లాంగ్ వీడియో ప్లేబ్యాక్‌ను పొందవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది.

4K వీడియో రికార్డింగ్ :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 4K రిజల్యూషన్‌తో వీడియో రికార్డు చేసే సామర్థ్యా్న్ని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాను అమర్చారు.
ఈ ట్యాబ్లెట్ వన్‌ప్లస్ కీ బోర్డును సపోర్టు చేస్తుంది. ఈ కీబోర్డు NFC పెయిరింగ్, మాగ్నటిక్ అటాచ్‌మెంట్ ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యా్బ్లెట్ వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ AI Writer, AI Summarize తోపాటు సర్కిల్ టూ సెర్చ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ 8 స్పీకర్‌లను కలిగి ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 యూరప్ మరియు నార్త్ అమెరికాలో ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంటుంది. అయితే భారత్ మార్కెట్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు వన్‌ప్లస్ ప్యాడ్ 3 ఇండియన్ వేరియంట్ ధర వివరాలను కూడా వెల్లడించలేదు.
* ఇవాళ విడుదల అయిన వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ 6.32 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది. 50MP + 50MP కెమరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5850mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications