వన్‌ప్లస్ ప్యాడ్ 3 ధర వివరాలు వెల్లడి.. రూ.7 వేల విలువైనవి ఉచితం, రూ.5 వేల డిస్కౌంట్..!
OnePlus Pad 3 Tablet Sale : వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ భారత్ లో జూన్ నెలలోనూ ఆవిష్కరించారు. అయితే అప్పట్లో సేల్ ప్రారంభం కాలేదు. గత నెలలో ఈ ఫోన్ సేల్ వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా సెప్టెంబర్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. తాజాగా ధర వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ ధర, సేల్ వివరాలు :
ఈ ట్యాబ్లెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.47,999 గా ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.52,999 గా ఉంది. సెప్టెంబర్ 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు. నోకాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి 7 వ తేదీ మధ్య కొనుగోలు చేసిన వారికి రూ.7,198 విలువైన వన్‌ప్లస్ స్టైలో 2 మరియు ఫోలియో కేస్ ను ఉచితంగా పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ట్యాబ్లెట్ 5.97mm థిక్‌నెస్ ను కలిగి ఉంది. 675 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 13.2 అంగుళాల 3.4K IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5T ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది.
12140mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్ ను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,140mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
8 స్పీకర్‌లు :
కనెక్టివిటీ పరంగా వైఫై 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం 8 స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ ఏకంగా 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ట్యాబ్లెట్ పనితీరు పరంగానే కాకుండా డిజైన్ పరంగానూ ఆకట్టుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








