వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ సేల్ తేదీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్‌సెట్..!
OnePlus Pad 3 Sale : భారత్ మార్కెట్‌లో జూన్ నెలలో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. కాంపాక్ట్ మోడల్‌గా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే అదే సమయంలో వన్‌ప్లస్ ప్యాడ్ 3 కూడా లాంచ్ అయింది. అయితే సేల్ ప్రారంభం ప్రారంభం కాలేదు. గత నెలలో ఈ ట్యాబ్లెట్ సేల్ పై వన్‌ప్లస్ ప్రకటన చేసింది. సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3 సేల్ వివరాలను వెల్లడించింది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

ఈ ట్యాబ్లెట్ స్ట్రోమ్, ప్రాస్టెడ్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ధర వివరాలను వెల్లడించలేదు. అమెరికాలో ఈ ట్యాబ్లెట్ $699 (సుమారుగా రూ.51700) ధరకు విడుదల అయింది. అయితే భారత్‌లో భారత్ ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రారంభ ధర సుమారుగా రూ.50 వేలుగా ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 13.2 అంగుళాల 3.4K డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400 x 3392 పిక్సల్స్, 144Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 315 PPI పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ :
వన్‌ప్లస్ ట్యాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, Adreno 830 GPU ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB/16GB LPDDR5x ర్యామ్, 256GB/512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3 OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు ఉన్న 13MP కెమెరాతో 4k వీడియో రికార్డింగ్ చేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది.
భారీ బ్యాటరీ :
డిస్‌ప్లే తరహాలోనే భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,140mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 1 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 92 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ జాబితాలో సర్కిల్ టూ సెర్చ్, ఏఐ రైటర్, AI Summarize ఉన్నాయి. ఈ ప్యాడ్ 3 కీ బోర్డు, వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్ ను కూడా సపోర్టు చేస్తుంది. అయితే ఈ రెండింటిని వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం ఈ ట్యాబ్లెట్ 8 స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అయితే ఈ ట్యాబ్లెట్ ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








