12140mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల డిస్‌ప్లేతో వన్‌ప్లస్ ప్యాడ్ 3.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
వన్‌ప్లస్ నుంచి జూన్ 5 వ తేదీన వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ గ్లోబల్‌గా (OnePlus Pad 3) విడుదల కానుంది. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్‌తోపాటు కీబోర్డు, స్టైలస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. డిజైన్ పరంగా ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ కేవలం 5.97mm థిక్‌నెస్‌తో స్లీక్ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 భారత్ మార్కెట్‌లో విడుదల కానుందా లేదా అనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే జూన్ 5 వ తేదీన వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. అయితే ఈ ట్యాబ్లెట్ వన్‌ప్లస్ ఓపెన్ కాన్వాస్ ను సపోర్టు చేస్తుంది. మరియు డీప్ సీ బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ కచ్చితమైన వివరాలు వెల్లడి కాకపోయినా.. కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

అంచనా వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 13.2 అంగుళాల 2K LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
12140mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3 వెనుక వైపు 13MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ట్యాబ్లెట్ 67W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 12140mAh బ్యాటరీ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ట్యాబ్లెట్ 8 స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ స్టోరేజీ, ఇతర ఫీచర్‌లు, ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా విడుదల తేదీ వెల్లడయింది. అయితే భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
* భారత్ మార్కెట్‌లో జూన్ 5 వ తేదీన వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 6.32 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఐఫోన్ యాక్షన్ కీ తరహాలో ప్లస్ కీ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే జీవితకాలం వారంటీని పొందుతుంది తెలిపింది. గ్రీన్ లైన్ సమస్యకే వారంటీ వర్తిస్తుందని తెలిపింది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా (OIS), 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌తోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, పింక్ రంగుల్లో లభిస్తుందని వన్‌ప్లస్ వెల్లడించింది.
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ రూ.50000 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. విడుదల అనంతరం వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








