వన్‌ప్లస్ ప్యాడ్ 3 సేల్.. 13.2 అంగుళాల డిస్‌ప్లే, 12,140mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్..!
OnePlus Pad 3 : వన్‌ప్లస్ నుంచి జూన్ నెలలో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అదే సమయంలో వన్‌ప్లస్ ప్యాడ్ 3 కూడా ఆవిష్కరించింది. అయితే 13s స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ప్యాడ్ 3 సేల్‌పై అప్పట్లో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా వన్‌ప్లస్ ప్యాడ్ 3 పైన వన్‌ప్లస్ ప్రకటన చేసింది. ఈ ఫోన్ ట్యాబ్లెట్ సెప్టెంబర్ నుంచి భారత్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
స్టోరేజీ, ధర వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ ధర వివరాలు వెల్లడి కాలేదు. అమెరికాలో ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర $699 (భారత కరెన్సీ ప్రకారం రూ.60000) గా ఉంది. త్వరలో భారత్ మార్కెట్‌లో త్వరలో ఈ ట్యాబ్లెట్ ధర వెల్లడయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ పూర్తి వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 13.2 అంగుళాల 3.4K (2400 x 3392 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 315 PPI పిక్సల్ డెన్సిటీ, 7:5 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. యూజర్లకు మంచి అనుభూతిని అందించే అవకాశం ఉంది.
శక్తివంతమైన చిప్‌సెట్ :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno 830 ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB/16GB LPDDR5x ర్యామ్, 256GB/512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,140mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను 92 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 6 గంటల వరకు గేమింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 13MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. వెనుక వైపు ఉన్న కెమెరా 4k వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ట్యాబ్లెట్ వన్‌ప్లస్ కీ బోర్డు, వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్‌ను సపోర్టు చేస్తుంది. అయితే ఈ రెండింటినీ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం 8 స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 AI Writer, AI Summarize, సర్కిల్ టూ సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మల్టీ టాస్కింగ్ సమయంలో ఈ ట్యాబ్లెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. త్వరలో ధర వివరాలతోపాటు కచ్చితమైన సేల్ తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








