OnePlus Pad Go సేల్.. ప్రారంభ ఆఫర్ కింద రూ.3000 వరకు తగ్గింపు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో ఇటీవల OnePlus Pad Go పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదల అయింది. ఈ ట్యాబ్‌ను బడ్జెట్ రేంజ్ ధర రూ.19,999కు లాంచ్ చేశారు. ఈ ట్యాబ్ రేపటి (అక్టోబర్ 20) నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ మరింత తక్కువ ధరకే ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు.
భారత్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ గో (OnePlus Pad Go) 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వైఫై వేరియంట్ ధర రూ.19999గా ఉంది. అదే వేరియంట్ LTE మోడల్ ధర రూ.21,999గా ఉంది. 256GB LTE మోడల్ ధర రూ.23999 గా ఉంది.

వన్‌ప్లస్ ప్యాడ్ గో సేల్ ఆఫర్లు: ఈ వన్‌ప్లన్ ట్యాబ్లెట్‌ను వన్‌ప్లస్ స్టోర్లు సహా ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్, క్రోమ ఇతర ప్లాట్‌ఫాంలో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్‌ను.. వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, OnePlus.in మరియు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ICICI బ్యాంకు, వన్‌కార్డ్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందుతారు.
అదే వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసినట్లయితే అదనంగా మరో రూ.1000 తగ్గింపును పొందుతారు. అయితే ఈ ఆఫర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ వైఫై వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్‌ను SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందుతారు. అదే ఫ్లిప్‌కార్టులో ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ గో డిజైన్ : వన్‌ప్లస్ పాడ్ గో ట్యాబ్లెట్ మెటాలిక్ బ్యాక్ ప్యానల్‌తో టూ టోన్ డిజైన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్ మందువైపు ఒకటి, వెనుక వైపు మరొక కెమెరాను అమర్చారు. ఈ డివైస్ ప్రీమియం వెర్షన్ మాదిరిగా స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ ట్యాబ్లెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 11.35 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 2.4k రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్ గరిష్ఠంగా 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతో ఈ ట్యాబ్ పాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో బ్యాటరీ : వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఈ ట్యాబ్ స్టోరేజీని మైక్రో SD కార్డును ఉపయోగించి 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు 33W సూపర్‌వాక్ ఛార్జింగ్ సపోర్టుతో 8000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








