Home
Tablets

OnePlus కొత్త టాబ్లెట్ సేల్ తేదీ విడుదలైంది! ధర, ఆఫర్లు & స్పెసిఫికేషన్లు

By Maheswara

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదలైంది. వన్‌ప్లస్ ఇప్పుడే టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు మరియు క్రికెట్ మ్యాచ్ లను ఆస్వాదించడానికి సరైన పరికరాన్ని లాంచ్ చేసింది. వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ OnePlus బ్రాండ్ నుండి వచ్చిన రెండవ టాబ్లెట్ మాత్రమే.

ఈ టాబ్లెట్ యొక్క ప్రీ ఆర్డర్ సేల్ అక్టోబర్ 12 న 12PM నుండి ప్రారంభమవుతాయి. ఇంకా, ఓపెన్ సేల్ అక్టోబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. ఈ వన్ ప్లస్ పరికరాన్ని ప్రీ-ఆర్డర్ చేసే వారి కోసం ఎంచుకోవడానికి అనేక ఆఫర్‌లను కలిగి ఉంది. అలాగే వన్ ప్లస్ యొక్క RCC సభ్యుల కోసం బ్యాంక్ డిస్కౌంట్‌లు మరియు ప్రయోజనాలతో పాటు వస్తుంది.

OnePlus Pad Go Pre- Orders And Sale Date Announced. Price, Specifications And Offers Details Here.

ధర మరియు సేల్ వివరాలు, ఆఫర్లు
వన్‌ప్లస్ ప్యాడ్ గో Wi-Fi మరియు LTE వేరియంట్‌లలో 128GB లేదా 256GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్ 8GB+128GB Wi-Fi వేరియంట్‌ ధర రూ. 19,999 తో ప్రారంభమవుతుంది. 8GB+256GB LTE వేరియంట్‌ ధర రూ.23,999 గా ఉంది. 8GB+128GB LTE వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.

మీరు ఆన్‌లైన్ ఛానెల్‌లలో మరియు OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో ఈ టాబ్లెట్ కోసం ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ,OnePlus.in, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, రిలయన్స్, క్రోమా మరియు ఇతర కీలక ఆఫ్‌లైన్ భాగస్వామి అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ గో ని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు అక్టోబర్ 12 నుండి రూ. 2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రీ-ఆర్డర్ ఆఫర్లో రూ. 1,399 విలువైన వన్‌ప్లస్ ప్యాడ్ గో ఫోలియో కవర్‌ను అందిస్తుంది. అదనంగా, మీరు వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్ అయితే, OnePlus.in లో వన్‌ప్లస్ ప్యాడ్ గో కొనుగోలుపై రూ. 2,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

OnePlus ప్యాడ్ గో స్పెసిఫికేషన్ల వివరాలు
OnePlus యొక్క సరికొత్త ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత OxygenOS 13.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది మరియు 11.35-అంగుళాల 2.4K (2408 x 1720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే, స్థిరమైన 90Hz రిఫ్రెష్ రేట్, పిక్సెల్ సాంద్రత, 220ppi స్పర్శ నమూనా రేటు 180Hz, మరియు గరిష్ట ప్రకాశం 400నిట్‌లు కలిగి ఉంది.

వన్ ప్లస్ ప్యాడ్ గో, మీడియా టెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది, 8GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 2.2 నిల్వతో జత చేయబడింది.ఈ one టాబ్లెట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) మద్దతుతో 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ముందువైపు కూడా సెల్ఫీ కెమెరా 8-మెగాపిక్సెల్ ఉంది.

బ్యాటరీ బ్యాకప్ పరంగా, వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ 33W సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతుతో 8,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.ఆడియో టెక్నాలజీ లో Omnibearing Sound Field మరియు Dolby Atmos క్వాడ్ స్పీకర్లను కూడా కలిగి ఉంది.

ఇక చివరగా, కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 5 (802.11ac), 802.11a/b/g/n/, బ్లూటూత్ 5.2 మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ టాబ్లెట్ జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, గైరోస్కోప్ మరియు హాల్ సెన్సార్ ఆన్‌బోర్డ్‌తో వస్తుంది మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ పరికరం యొక్క సైజు గమనిస్తే 25.512 x 18.804 x 0.689 సెం.మీ మరియు 532గ్రాముల బరువు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Pad Go Pre- Orders And Sale Date Announced. Price, Specifications And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X