11.3 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ OnePlus ట్యాబ్లెట్‌పై రూ.2000 డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
OnePlus Pad Go Tablet : భారత్ మార్కెట్ లో వన్‌ప్లస్ సంస్థ గత సంవత్సరం వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ ను ఏకంగా రూ.2000 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ 8000mAh బ్యాటరీ, 11.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ప్యాడ్ LTE, Wi-Fi వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఎక్కువ సమయం ట్యాబ్లెట్ ఉపయోగించినా కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. రూ.15 వేల ధరలో ట్యాబ్లెట్స్ కోసం చూస్తున్న వారికి ఈ ప్యాడ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
ఈ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ :
వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ ను ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) ధర రూ.19999 గా ఉండేది. ప్రస్తుతం రూ.17999 గా ఉంది. ICICI, RBL క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

అదే 8GB ర్యామ్ + 128GB (WiFi + LTE) వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.21999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.19999 గా ఉంది. ICICI, RBL క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + LTE) వేరియంట్ ను రూ.21999 గా ఉంది. ICICI, RBL క్రెడిట్ కార్డులతో రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు.
డ్యూయల్ టోన్ డిజైన్ :
డిజైన్ పరంగా సన్నని బెజెల్స్ తో వన్‌ప్లస్ ప్యాడ్ గో ఆకట్టుకుంటుంది. మరియు డ్యూయల్ టోన్ డిజైన్ తో కూడిన మెటాలిక్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 11.3 అంగుళాల 2.4k డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు Low Blue లైట్ టెక్నాలజీని కలిగి ఉంది. ఐ కంఫర్ట్, బెట్‌టైం, నేచుర్ టోన్ డిస్‌ప్లే వంటి మూడు మోడ్స్ ను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
కెమెరా, బ్యాటరీ వివరాలు :
ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13.2 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. బ్యాటరీ పరంగా ఈ ట్యాబ్లెట్ 8000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








