వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఏకంగా రూ.4000 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ట్యాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్ గో (Oneplus Pad Go Tablet Price Cut) ధరను తగ్గించింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఈ ట్యాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ 11.3 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు WiFi మరియు LTE వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌ల ధరలను తగ్గిస్తూ వన్‌ప్లస్ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ ప్రస్తుతం మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi), 8GB ర్యామ్ + 128GB (LTE) మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (LTE) వేరియంట్‌లలో లభిస్తుంది. వైఫై వేరియంట్ ధర రూ.19,999 గా ఉండగా.. సంస్థ తాజాగా రూ.2000 తగ్గించింది. ఫలితంగా బేస్ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.

ధర తగ్గింపు అనంతరం 8GB ర్యామ్ + 128GB (LTE) ధర రూ.19,999 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (LTE) ధర రూ.21,999 గా ఉంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చని వన్‌ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ 11.3 అంగుళాల 2.4K డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ప్రీమియం వెర్షన్ తరహా డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ Low బ్లూ లైట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. బ్లూ లైట్ కారణంగా కళ్లకు ప్రమాదం కలగకుండా చూస్తుంది. వీటితోపాటు కళ్లకు హాని కలగకుండా Eye Comfort మోడ్ మరియు నేచర్ టోన్ డిస్‌ప్లే మోడ్, బెడ్‌టైమ్ మోడ్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా రాత్రి సమయాల్లో ట్యాబ్లెట్ ను ఉపయోగించినా ఎటువంటి హాని జరగదు.
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS పైన పనిచేస్తుంది. మరియు 33W ఛార్జింగ్ సపోర్టుతో 8000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








