11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో OnePlus Pad Lite విడుదల.. తొలి సేల్‌లో రూ.3000 డిస్కౌంట్!
OnePlus Pad Lite launched : వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. వైఫై, LTE వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కాగా... తాజాగా ఇండియాలో లాంచ్ అయింది. ఈ వన్‌ప్లస్ ట్యా్బ్లెట్ క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 11 అంగుళాల HD+ 10 బిట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1920 x 1200 పిక్సల్స్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ ట్యాబ్లెట్ డిస్‌ప్లే ఫ్లిక్కర్ ఫ్రీ, Low Blue లైట్‌తో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఏరో బ్లూ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. భద్రత కోసం ఫేసియల్ రికగ్ననైజేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 530 గ్రాముల బరువును కలిగి ఉంది.
ప్రాసెసర్, OS వివరాలు :
ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G100 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది.

భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9,340mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 5MP కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు.
ఈ ట్యాబ్లెట్ Hi-Res ఆడియో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. SBC, AAC, LDAC ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా వైఫై, 4G LTE, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ధర, సేల్ వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 4G LTE) ధర రూ.17999 గా ఉంది. రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, స్పెషల్ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.
9340 mAh battery for hustle that just doesn't quit. #OnePlusPadLite
— OnePlus India (@OnePlus_IN) July 23, 2025
Know more: https://t.co/TER6pvcgTc pic.twitter.com/Q17xy5skRA
ఆగస్టు 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ ట్యా్బ్లెట్ సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ సహా వన్‌ప్లస్ స్టోర్‌లతోపాటు ఇతర భాగస్వామ్య స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








