Home
Tablets

తక్కువ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. 9340mAh బ్యాటరీ, 11 అంగుళాల డిస్‌ప్లేతో..!

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో ఇటీవలే వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ విడుదల అయింది. వైఫై, LTE వేరియంట్స్‌లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ డిజైన్‌ సహా ఫీచర్ల పరంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్‌ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.

భారత్‌లో విడుదల సమయంలో ఈ ట్యాబ్లెట్‌ (Oneplus Pad Lite Tablet) 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.15999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.14999 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే రూ.2000 డిసౌంట్‌ను పొందవచ్చు.

Oneplus Pad lite

రూ.1000 డిస్కౌంట్‌ కూడా :
దీంతోపాటు 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi + 4G LTE) ధర రూ.17999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు. ఏరో బ్లూ కలర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ :
ఈ ట్యాబ్లెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 11 అంగుళాల HD+ 10 బిట్‌ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్‌ ఫ్రీ తో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Oneplus Pad lite

9340mAh భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ వెనుక, ముందు వైపు 5MP కెమెరాలను కలిగి ఉంది. 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్‌ 4G LTE, బ్లూటూత్ 5.4, Wi-Fi, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టుతో Hi-Res ఆడియో గోల్డ్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌తో క్వాడ్ స్పీకర్‌ యూనిట్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

* భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ డిసెంబర్‌ 17 వ తేదీన లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 మొబైల్‌ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

చైనాలో ఇటీవల లాంచ్‌ అయిన వన్‌ప్లస్ ఏస్‌ 6T ఫోన్‌... భారత్‌లో వన్‌ప్లస్‌ 15R మోడల్‌గా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు భారీ బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Pad lite now with 9340mAh battery and 11 inches display now on discount price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X