Home
Tablets

బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌

వన్‌ప్లస్‌ ఈ సంవత్సరం జులై నెలలో బడ్జెట్‌ ట్యాబ్లెట్‌ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ను ( OnePlus Pad Lite Tablet price drop ) లాంచ్‌ చేసింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా 11 అంగుళాల డిస్‌ప్లే. 9340mAh భారీ బ్యాటరీ సహా అనేక మెరుగైన ఫీచర్‌ లను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ట్యాబ్లెట్‌ ను డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంకు కార్డులతోనూ అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ లు, డిస్కౌంట్‌ పూర్తి వివరాలు.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు :
భారత్‌ మార్కెట్‌ లో విడుదల సమయంలో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ( WiFi ) వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (WiFi + 4G LTE) ధర రూ.17999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Oneplus Pad lite Tablet telugu news

రూ.14999 ధరకే వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌ :
అమెజాన్‌ లో ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ ధరలు రూ.14999. రూ.16999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను కూడా అందిస్తోంది. ఫలితంగా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ ధరలో లేటెస్ట్‌ ట్యాబ్లెట్స్‌ కోసం చూస్తుంటే ఈ ప్యాడ్‌ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్‌ ఏరో బ్లూ కలర్‌ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల HD+ (1920 x 1200 పిక్సల్స్‌) 10 బిట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ తో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Oneplus Pad lite Tablet telugu news

మీడియాటెక్‌ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌ తో 54 రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుందని వన్‌ప్లస్‌ చెబుతోంది.

కెమెరాల వివరాలు :
ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 5MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. Hi-Res ఆడియోతో క్వాడ్ స్పీకర్‌ లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. వైఫై, బ్లూటూత్‌ 5.4, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Pad lite Tablet now available at Rs14999 price on amazon full features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X