Home
Tablets

బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో..!

వన్‌ప్లస్‌ ఈ సంవత్సరం రెండో భాగంలో బడ్జెట్‌ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో ట్యాబ్లెట్‌ ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ క్వాడ్‌ స్పీకర్‌ యూనిట్‌ ను కలిగి ఉంది. Kids Space ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ ను బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ప్రారంభ ధర రూ.15,999 :
వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ ( OnePlus Pad Lite Tablet ) ప్రస్తుతం అమెజాన్‌ లో (Amazon) 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.15,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi + 4G LTE) ధర రూ.17,999 గా ఉంది.

Oneplus Pad Lite Tablet bank discount

ఈ ట్యాబ్లెట్‌ ను ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.13999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ ఏరో బ్లూ కలర్‌ వేరియంట్‌ లోనే లభిస్తోంది.

వన్‌ప్లస్ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ పూర్తి వివరాలు :
ఈ ట్లాబ్లెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్‌ ఫ్రీ తో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్‌ 15 OS :
ఈ ట్యాబ్లెట్‌ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 5MP కెమెరా, ముందు వైపు 5MP కెమెరాను కలిగి ఉంది.

54 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో భారీ బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ట్యా్బ్లెట్ 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 80 గంటల మ్యూజిక్ ప్లే టైమ్ లేదా 11 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 54 రోజుల స్టాండ్‌బై టైమ్‌ ను అందిస్తుందని వన్‌ప్లస్‌ చెబుతోంది.

క్వాడ్ స్పీకర్‌ యూనిట్‌ :
ఈ ట్యాబ్లెట్‌ Hi - Res ఆడియో గోల్డ్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ తో కూడిన క్వాడ్ స్పీకర్‌ యూనిట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు షేరింగ్ ఫీచర్‌ తోపాటు కిడ్స్‌ మోడ్‌ ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi, 4G LTE, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేసియల్‌ రికగ్నైజేషన్ ఫీచర్‌ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Pad Lite Tablet now available with Rs2000 discount on bank cards on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X