రూ.14999 ధరకే 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో OnePlus Pad Lite ట్యాబ్లెట్..!
Oneplus Pad Lite Tablet : వన్‌ప్లస్ నుంచి గత నెల చివల్లో వన్‌ప్లస్ ప్యా్డ్ లైట్ విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ WiFi, LTE వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ సేల్ ప్రస్తుతం ప్రారంభం అయింది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 9340mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. దీంతోపాటు క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను అమర్చి ఉంటుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 4G LTE) ధర రూ.17999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అయింది.

రూ.1000 డిస్కౌంట్ :
వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, వన్‌ప్లస్ స్టోర్‌లు, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో కూపన్ కోడ్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ఏరో బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ 11 అంగుళాల HD+ (1920 x 1200 పిక్సల్స్) 10 బిట్ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తోంది.
ఈ ట్యాబ్లెట్ 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్‌తో 54 గంటల స్టాండ్‌బై టైంను అందిస్తుందని వన్‌ప్లస్ చెబుతోంది. లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను అందిస్తుంది. లేదా 11 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను అందిస్తుందని వన్‌ప్లస్ చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 5MP కెమెరా మరియు ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే ఈ మెరుగైన ఆడియో సపోర్టు కోసం Hi-Res ఆడియో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. SBC, AAC, LDAC ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ సెక్యూరిటీ కోసం ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా WiFi, 4G LTE, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








