Home
Tablets

వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ పై భారీ డిస్కౌంట్‌.. 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీ సహా..!

OnePlus Pad Lite : వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్ భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ వైఫై, సెల్యూలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ రూ.15 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు ఆఫ‌ర్లతో మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్‌ :
వన్‌ప్లస్‌ ప్యాడ్ లైట్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi) వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi + 4G LTE) ధర రూ.17999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో (Amazon) భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

Oneplus pad lite tablet

గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌ లో ట్యాబ్లెట్ రూ.1500 డిస్కౌంట్‌ తో రూ.14499, రూ.16499 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. అంటే గరిష్ఠంగా రూ.3500 వరకు తగ్గింపును పొందవచ్చు.

11 అంగుళాల డిస్‌ప్లే :
వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని కలగకుండా ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ మీడియాటెక్ హీలియో G100 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పైన పనిచేస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Oneplus pad lite tablet

సింగిల్ ఛార్జింగ్‌తో ఏకంగా 54 రోజుల స్టాండ్‌బై టైం :
ఈ ట్యాబ్లెట్‌ 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 80 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్ టైం లేదా 54 రోజుల స్టాండ్‌బై టైంను పొందవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది.

కెమెరా విభాగం పరంగా ఈ ప్యాడ్‌ వెనుక వైపు 5MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 1080p రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. Hi-Res ఆడియో గోల్డ్‌ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో క్వాడ్ స్వీకర్‌ యూనిట్‌ ఉంది.

ఏరో బ్లూ కలర్ వేరియంట్ :
కనెక్టివిటీ పరంగా వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్ 4G, వైఫై, బ్లూటూత్‌ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్ ఉంది. కిడ్స్ మోడ్‌ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్‌ కేవలం ఏరో బ్లూ కలర్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus pad lite tablet with 11 inch display, 9340mAh battery gets rs3500 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X