Home
Tablets

OnePlus ప్యాడ్ టాబ్లెట్ ధర విడుదలయింది! సేల్ తేదీ,ఆఫర్లు & స్పెసిఫికేషన్లు

By Maheswara

వన్ ప్లస్ సంస్థ తన మొట్టమొదటి టాబ్లెట్, OnePlus Pad ను ఏప్రిల్ 28న భారతదేశంలో ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ టాబ్లెట్ ధర కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 37,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడుతుంది.ఈ టాబ్లెట్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వన్ ప్లస్ ప్యాడ్ టాబ్లెట్, మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్, 9510mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ 11.6 అంగుళాల LCD డిస్ప్లే మరియు 12GB వరకు RAM వివరాలు, వన్ ప్లస్ సేల్ తేదీ మరియు వన్ ప్లస్ ప్యాడ్ కొనుగోలుపై అందుబాటులో ఉండే ఆఫర్‌ల వివరాలను కూడా ప్రకటించింది.

OnePlus Pad Tablet India Price Released, Pre-Orders Set To Start On April 28. Specifications Details In Telugu.

ఈ వన్ ప్లస్ ప్యాడ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేయబడింది అలాగే వీటి ధరలు కూడా తెలుసుకుందాం. 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 గా ఉంది. అయితే 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ఈ టాబ్లెట్ కేవలం ఒక హాలో గ్రీన్ రంగు వేరియంట్‌లో మాత్రమే వస్తుంది.

ఇది ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ ధృవీకరించింది. ఈ టాబ్లెట్ భారతదేశంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు Oneplus.in లలో మే 2న మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ సేల్‌కి వస్తుంది.

ఈ టాబ్లెట్ తో పాటు వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ ప్యాడ్ కోసం కొన్ని ఉపకరణాలను కూడా లాంచ్ చేసింది. ఇందులో వన్ ప్లస్ మాగ్నెటిక్ కీబోర్డ్ ధర రూ. 7,999, వైట్ స్టైలస్ (స్టైలో) రూ. 4,999 మరియు ఫోలియో కేస్ రూ. 1,499 ఉన్నాయి.

ఇక వన్ ప్లస్ ప్యాడ్ ఆఫర్లు గమనిస్తే, OnePlus.in, వన్ ప్లస్ స్టోర్ యాప్, Amazon.in, Flipkart.com, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు మరియు ఎంపిక చేసిన పార్టనర్ స్టోర్‌లలో ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 తక్షణ తగ్గింపు ఆఫర్ పొందుతారు.

ఇంకా OnePlus.in, Amazon.in, Flipkart.com, కొన్ని వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, కొన్ని రిలయన్స్ మరియు క్రోమా స్టోర్‌లలో ప్రీ ఆర్డర్‌లపై రూ.1,499 విలువైన ఫోలియో కేస్‌ను ఉచితంగా పొందుతారు. ఇంకా, వన్ ప్లస్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కింద, కొనుగోలుదారులు వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు బదులుగా అదనంగా రూ. 5,000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లకు బదులుగా రూ. 3000 పొందవచ్చు.

వన్ ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 500 nits బ్రైట్‌నెస్‌ని అందించే 11.6 అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది మీడియా టెక్
డైమెన్సిటీ 9000 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మరియు 12GB వరకు RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం కెమెరా వివరాలు పరిశీలిస్తే, ఇది EISకి మద్దతు ఇచ్చే 13MP వెనుక కెమెరాతో వస్తుంది మరియు 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం, ఇది 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది కేవలం వైఫై వేరియంట్‌లో మాత్రమే వస్తుంది.

కొలతల పరంగా, ఈ టాబ్లెట్ 6.5mm మందంతో మరియు 552gm బరువు ఉంటుంది. ఈ టాబ్లెట్‌లో 9,510 mAh బ్యాటరీ ఉంది. అలాగే, 65W సూపర్ ఊక్ ఛార్జింగ్ టెక్‌కు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా, ఈ వన్ ప్లస్ ప్యాడ్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో రాదు, కాబట్టి, మీరు బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను మాత్రమే వాడవలసి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Pad Tablet India Price Released, Pre-Orders Set To Start On April 28. Specifications Details In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X