12.1 అంగుళాల డిస్‌ప్లే, 10,050mAh బ్యాటరీతో ఒప్పో ట్యాబ్లెట్.. ఇవాళ్టి నుంచే..!
Oppo Pad 5 tablet : భారత్ మార్కెట్ లో ఒప్పో ప్యాడ్ 5 ట్యాబ్లెట్ విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ భారీ బ్యాటరీ, 10050mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచే ఈ ట్యాబ్లెట్ ను ముందస్తు ఆర్డర్ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ వైఫై, 5G కనెక్టివిటీ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
ఒప్పో ప్యాడ్ 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 2.8k (2800 x 1980 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 540Hz టచ్ శాంప్లింగ్ రేట్, 284 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ఒప్పో ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉంది. Arm Mali G615 MC2 ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్ LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఒప్పో ప్యాడ్ 5 ట్యాబ్లెట్ f/2.0 అపేచర్, ఆటోఫోకస్, 77 డిగ్రీల ఫీల్డ్ వ్యూ తో 8MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 30fps తో 1080p రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఒప్పో ట్యాబ్లెట్ 33W SuperVooc వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,050mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, AI Eraser, AI Summery, AI Recording Summery వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ ట్యాబ్లెట్ వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్, ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, హాల్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్‌లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను సపోర్టు చేస్తుంది.
ఒప్పో ప్యాడ్ 5 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi) వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi +5G) వేరియంట్ ధర రూ.32999 గా ఉంది.
ఈ ట్యాబ్లెట్ ను ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. జనవరి 13 వ తేదీన సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఒప్పో ట్యాబ్లెట్ స్టార్‌లైట్ బ్లాక్, ఆరోరా పింక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








