Home
Tablets

మీడియాటెక్‌ చిప్‌సెట్‌, 12.1 అంగుళాల డిస్‌ప్లే, 10500mAh బ్యాటరీతో ఒప్పో ట్యాబ్లెట్‌!

OPPO Pad Air 5 : ఒప్పో ప్యాడ్‌ ఎయిర్‌ 5 ట్యాబ్లెట్‌ విడుదల అయింది. ఈ ట్యా్బ్లెట్‌ భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు మీడియాటెక్ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, స్పెసిఫికేషన్‌ లు, ధర, సేల్‌ వివరాలు.

ఒప్పో ప్యాడ్ ఎయిర్‌ 5 ట్యాబ్లెట్‌ పూర్తి వివరాలు :
ఈ ట్యాబ్లెట్‌ 12.1 అంగుళాల 2.8K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 900 నిట్స్‌ HBM బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 6.83 mm థిక్‌నెస్‌ తో 597 గ్రాముల బరువును కలిగి ఉంది.

OPPO Pad Air 5 Tablet launched

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ ఒప్పో ట్యాబ్లెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ మెరుగైన ఆడియో కోసం క్వాడ్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. ఒప్పో ప్యాడ్‌ ఎయిర్‌ 5 ట్యాబ్లెట్‌ బ్లూటూత్‌ 5.4, వైఫై 6 పైన పనిచేస్తుంది.

ఒప్పో ట్యాబ్లెట్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 ట్యాబ్లెట్ ప్రస్తుతం చైనా లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. చైనాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర CNY 1899 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.24,200) గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర CNY 2199 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.28,100) గా ఉంది.

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,499 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.32,200) గా ఉంది. సాఫ్ట్‌ లైట్ వేరియంట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర CNY 2399 (భారత కరెన్సీ ప్రకారం రూ.31200), సాఫ్ట్‌ లైట్ వేరియంట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర CNY 2699 (భారత కరెన్సీ ప్రకారం రూ.35,100) గా ఉంది.

ఈ ట్యాబ్లెట్‌ సేల్‌ చైనా మార్కెట్‌ లో డిసెంబర్‌ 31 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్‌ లో కొనుగోలు చేయవచ్చు. స్పేస్‌ గ్రే, స్టార్‌లైట్‌ పౌడర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లాంచ్‌ కానుంది. భారత్‌ లో ఈ ట్యాబ్లెట్‌ విడుదలపై ఎటువంటి స్పష్టత లేదు. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒప్పో రెనో 15 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Pad Air 5 Tablet launched with mediatek dimensity 7300 Ultra chip, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X