రూ.13999 కే 11 అంగుళాల డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో OPPO ట్యాబ్లెట్.. పూర్తి వివరాలు..!
OPPO Pad SE : ఒప్పో నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇవాళ ఒప్పో రెనో 14 5G సిరీస్‌తోపాటు ఒప్పో ప్యాడ్ SE కూడా విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. మరియు ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు భారీ బ్యాటరీ మరియు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ఒప్పో ప్యాడ్ SE ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఒప్పో ట్యాబ్లెట్ 11 అంగుళాల HD (1200x1920 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 207 ppi పిక్సల్ డెన్సిటీ, 85.3 శాతం స్క్రీన్ టూ బాడీ రేడియోను కలిగి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ ఒప్పో ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ G100 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 128G UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15.0.1 పైన పనిచేస్తుంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఒప్పో ప్యాడ్ SE O+ కనెక్ట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఐఫోన్, ఐప్యాడ్స్‌కు ఫైల్స్‌ను సులభంగా షేర్ చేసుకోవచ్చు. మరియు AI Photo Remaster, AI Intelligent Document వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఒప్పో ప్యాడ్ SE వెనుక వైపు f/2.2 అపేచర్, ఆటోఫోకస్ సపోర్టుతో 5MP కెమెరా, ముందువైపు f/2.2 అపేచర్‌తో 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ సెక్యూరిటీ కోసం ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది.
9340mAh బ్యాటరీ :
ఈ ప్యాడ్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 9340mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 11 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ టైం లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను పొందవచ్చని ఒప్పో చెబుతోంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 802.11 తోపాటు ఇ-కంపాస్, యాక్సెలిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను అమర్చారు.

ఒప్పో ప్యాడ్ SE ధర, సేల్ :
ఒప్పో ప్యాడ్ SE ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ WiFi వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ LTE వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ LTE వేరియంట్ ధర రూ.16999 గా ఉంది.
ఈ ట్యాబ్లెట్ స్టార్‌లైట్ సిల్వర్, ట్విలైట్ బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ సేల్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో అందించే కూపన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఒప్పో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








