Home
Tablets

12.1 అంగుళాల డిస్‌ప్లే, 10000mAh బ్యాటరీ 5G ట్యాబ్లెట్‌ సేల్‌.. రూ.3000 తగ్గింపు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు గ్యాడ్జెట్ల తయారీ సంస్థ పోకో నుంచి పోకో ప్యాడ్‌ 5G (Poco Pad 5G sale) ట్యాబ్లెట్‌ ఇటీవల భారత్‌లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ ప్యాడ్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ పోకో ట్యాబ్లెట్‌ 12 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌, 10000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తగ్గింపు ధరలను పొందవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పోకో ప్యాడ్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో ప్యాడ్‌ 5G ట్యాబ్లెట్‌ 12.1 అంగుళాల LCD డిస్‌ప్లే ను కలిగి ఉంది. 2560*1600 పిక్సల్‌ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, 16:10 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

Poco Pad 5G tablet sale started on flipkart

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
ఈ పోకో ట్యాబ్లెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1.5TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

10000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా పోకో ప్యాడ్‌ 5G ట్యాబ్లెట్‌ వెనుకవైపు 8MP కెమెరా, ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 33W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

ఈ ట్యాబ్లెట్ IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. రెండు మైక్రో ఫోన్‌లు, క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టు, డాల్బీ విజన్‌ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా పోకో ట్యాబ్లెట్ డ్యూయల్‌ 5G, వైపై 6, GPS, బ్లూటూత్‌ 5.2, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది.

పోకో ప్యాడ్‌ 5G ధర, సేల్‌ వివరాలు :
పోకో ప్యాడ్‌ 5G ట్యాబ్లెట్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. SBI, HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఈ ట్యాబ్లెట్ కోబాల్ట్‌ బ్లూ, Pistachio గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco Pad 5G tablet sale started on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X