Home
Tablets

Poco నుంచి మొట్ట మొదటి టాబ్లెట్ లాంచ్ అయింది!ధర, స్పెసిఫికేషన్లు

Poco ఇటీవల తన టాప్-ఎండ్ F6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ లను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో Poco F6 మరియు Poco F6 ప్రో ఫోన్లు ఉన్నాయి. అయితే, కంపెనీ వీటితో పాటుగా తన మొట్టమొదటి టాబ్లెట్‌ పోకో ప్యాడ్ ని కూడా ఈ ఈవెంట్‌లో విడుదల చేసింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Poco Pad అనేది స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, సూపర్-స్మూత్ డిస్‌ప్లే, క్వాడ్ స్టీరియో స్పీకర్లు, పెద్ద బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్ మరియు HyperOS తో సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన మధ్య-శ్రేణి ఆండ్రాయిడ్ టాబ్లెట్ గా లాంచ్ అయింది.

Poco Pad Tablet launched

పోకో ప్యాడ్ ధర, రంగుల ఎంపికల వివరాలు
పోకో ప్యాడ్ ఒకే ఒక 8GB/256GB మోడల్‌ లో వస్తుంది. ఈ Poco ప్యాడ్ ధర $330 (దాదాపు రూ. 27,500)గా నిర్ణయించబడింది. అయితే, ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్‌లు దీనిని $299 (దాదాపు రూ. 25,000)కి కొనుగోలు చేయగలుగుతారు.

ఈ పోకో ప్యాడ్ గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పోకో తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో అనేక ఉపకరణాలను కూడా విడుదల చేసింది, ఇందులో కీబోర్డ్ ($80), స్మార్ట్ పెన్ ($60), మరియు బేసిక్ కవర్ ($20) కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి, భారతదేశంలో Poco ప్యాడ్ లభ్యత గురించి ఎటువంటి సమాచారం లేదు.

పోకో ప్యాడ్ స్పెసిఫికేషన్ల వివరాలు
పోకో ప్యాడ్ టాబ్లెట్ 8GB LPDDR4X RAM మరియు 256GB UFS 2.2 స్టోరేజ్‌తో జత చేయబడిన స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పోకో ప్యాడ్ 12.1-అంగుళాల 2.5K LCD స్క్రీన్‌తో గరిష్టంగా 600 నిట్‌ల ప్రకాశంతో ఉంటుంది. ఇది డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ (30/48/50/60/90/120Hz) మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ పోకో ప్యాడ్‌లోని ప్యానెల్ TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంది. లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ మరియు సిర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేట్ పొందింది. ఇది గొరిల్లా గ్లాస్ 3 ద్వారా రక్షించబడింది మరియు డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ పోకో ప్యాడ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇంకా, ఈ టాబ్లెట్ HyperOS ఆధారంగా HyperOS ని తీసుకువస్తుంది.

ఈ పోకో ప్యాడ్‌లో f/2.0 ఎపర్చర్‌తో 8MP వెనుక కెమెరా మరియు f/2.28 ఎపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ముందు మరియు వెనుక కెమెరాలు రెండూ 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయగలవు. ఈ పోకో ప్యాడ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్లను కూడా ప్యాక్ చేస్తుంది. దీని బరువు 571 గ్రాములు మరియు మందం 7.52 మిమీ గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco Pad Tablet With Snapdragon 7s Gen 2 SoC Processor Launched In Global Market. Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X