Home
Tablets

8340mAh బ్యాటరీతో రియల్‌మి ప్యాడ్‌ 2.. 38 గంటల బ్యాకప్‌తో బడ్స్‌ విడుదల.. సేల్‌ వివరాలు..!

రియల్‌మి ఇవాళ P1 సిరీస్‌తోపాటు రియల్‌మి ప్యాడ్‌ 2 (Realme Pad 2) మరియు బడ్స్‌ T110 (Realme Buda T110) ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ రియల్‌మి ప్యాడ్ 2 అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. అదే విధంగా ఇయర్‌బడ్స్‌ 10mm డైనమిక్‌ బాస్‌ డ్రైవర్లను కలిగి ఉంది.

రియల్‌మి ప్యాడ్‌ 2 Wi-Fi స్పెసిఫికేషన్లు :
రియల్‌మి ప్యాడ్‌ 2.. 11.5 అంగుళాల 2K IPS స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 450 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. మరియు డాల్బీ ఆట్మాస్‌ సపోర్టుతో క్వాడ్‌ స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు 518 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. మరియు 7.2mm థిక్‌నెస్‌తో లాంచ్‌ అయింది.

Realme Pad 2 launched

రియల్‌మి ప్యాడ్‌ 2.. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 పైన పనిచేస్తుంది. మరియు 6nm మీడియాటెక్‌ హీలియో G99 CPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు Arm Mail G57 GPU తో జతచేయబడి ఉంటుంది. 33W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 8340mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ ప్యాడ్‌ 2 వెనుకవైపు 8MP కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది. మరియు 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ కింద రియల్‌మి సంస్థ రూ.2000 తగ్గింపు ధరను ప్రకటించింది. realme.com మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Realme Pad 2 launched

ఏప్రిల్‌ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి ప్యాడ్‌ వైఫై 5 మరియు బ్లూటూత్‌ 5.2 సహా అనేక సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్‌ గ్రీన్‌, ఇమేజినెషన్‌ గ్రీన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి బడ్స్‌ T110 స్పెసిఫికేషన్లు :
రియల్‌మి బడ్స్‌ T110 కాలింగ్‌ కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత (AI) ENC (ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) ఫీచర్‌ మరియు 10mm డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంటుంది. IPx5 రేటింగ్‌తో బ్లూటూత్‌ 5.4 పైన పనిచేస్తాయి.

Realme Pad 2 launched

సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 38 గంటలపాటు బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. మరియు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ ద్వారా 2 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ రియల్‌మి బడ్స్‌ T110 ధర రూ.1499 గా ఉంది. మరియు కంట్రీ గ్రీన్, జాజ్‌ బ్లూ, పంక్‌ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ రియల్‌మి బడ్స్‌ T110 తొలి సేల్‌ ఏప్రిల్‌ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.200 తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Pad 2 and buds T110 launched with 38 hours of backup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X