Home
Tablets

రియల్ మీ కొత్త టాబ్లెట్, Realme Pad 2 స్పెసిఫికేషన్లు లీక్ ! వివరాలు

By Maheswara

Realme సంస్థ నుండి రియల్ మీ ప్యాడ్ 2 త్వరలో లాంచ్ కు సిద్ధం కాబోతోంది. ఇది, 2021లో లాంచ్ చేసిన Realme Pad కు కొనసాగింపుగా వస్తుంది. అలాగే, ఇది ఈ సంవత్సరం చివరిలో మార్కెట్లోకి లాంచ్ అవుతుంది. ఈ Realme Pad 2 గురించి కంపెనీ అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. కానీ, ఈ టాబ్లెట్ యొక్క ఫీచర్లు మరియు డిజైన్ వివరాలు ఇటీవల ఒక టిప్‌స్టర్ ద్వారా లీక్ చేయబడ్డాయి.

టిప్‌స్టర్ ద్వారా లీక్ అయిన వివరాలలో, ఈ రాబోయే టాబ్లెట్ యొక్క ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా మరియు సాఫ్ట్‌వేర్ వివరాలు ఉంటాయి. ఇది 33W ఛార్జింగ్‌కు మద్దతుతో 8,360mAh బ్యాటరీతో శక్తినిచ్చే అవకాశం ఉంది.అదనంగా, టిప్‌స్టర్ రాబోయే టాబ్లెట్ యొక్క అంచనా స్పెసిఫికేషన్‌లను వెల్లడి చేసారు.

Realme Pad 2 Tablet Design Surfaced Online, Leaked Specifications Details Here.

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (ట్విట్టర్: @yabhishekhd) ట్విట్టర్ ద్వారా ఈ Realme Pad 2 యొక్క డిజైన్‌తో పాటు కొన్ని స్పెసిఫికేషన్‌లను లీక్ చేసారు. ఈ టాబ్లెట్ యొక్క లీకైన డిజైన్ రెండర్లు ఇది మెటాలిక్ గ్రే కలర్ షేడ్‌లో అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ టాబ్లెట్ వెనుక ప్యానెల్‌లో వృత్తాకార కెమెరా సెటప్ లో డ్యూయల్-కెమెరా సెన్సార్‌ కూడా వస్తుంది.

Realme Pad 2 పైభాగంలో పవర్ బటన్ మరియు కుడి వైపు అంచున వాల్యూమ్ బటన్ కూడా ఉన్నట్లు చూపబడింది. అదనంగా, ఈ టిప్‌స్టర్ రాబోయే టాబ్లెట్ యొక్క అంచనా స్పెసిఫికేషన్‌లను కూడా పంచుకున్నారు. ఈ అంచనా స్పెసిఫికేషన్ల ప్రకారం వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

సంస్థ యొక్క ఈ రియల్‌ మీ టాబ్లెట్‌లో 8GB RAM మరియు 128GB స్టోరేజీ తో జత చేయబడిన మీడియా టెక్ హీలియో G99 SoC ని అమర్చవచ్చు. ఇది USB టైప్ C ద్వారా 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,360mAh బ్యాటరీతో వస్తుంది. ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఇది 20 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ సెన్సార్‌తో రవాణా చేయబడే అవకాశం ఉంది. ఈ రియల్‌ మీ ప్యాడ్ 2 ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌ మీ UI 4.0 అవుట్ ఆఫ్ ది బాక్స్‌ లో వస్తుందని చెప్పబడింది. ఇవి కాకుండా, ఈ టాబ్లెట్ క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుందని నివేదికలు తెలియచేస్తున్నాయి.

ఈ Realme Pad 2 టాబ్లెట్ 2021లో లాంచ్ చేయబడిన Realme Pad కు కొనసాగింపుగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ టాబ్లెట్ 10.4 అంగుళాల WUXGA+ (2,000x1,200 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో G80 SoC ప్రాసెసర్ తో వస్తుంది. దీనితో పాటు గరిష్టంగా 4GB RAM మరియు 64GB వరకు స్టోరేజీ కలిగి ఉంటుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, 105 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) కలిగిన అల్ట్రా-వైడ్ లెన్స్‌తో, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రియల్ మీ ప్యాడ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7,100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది OTG కేబుల్ ద్వారా రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని లీక్ అయిన వివరాలు తెలియచేస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Pad 2 Tablet Design Surfaced Online, Leaked Specifications Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X