Home
Tablets

11.5 అంగుళాల 2K డిస్‌ప్లే, 8360mAh బ్యాటరీతో Realme కొత్త ట్యాబ్‌..!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ రియల్‌మీ ఇవాళ కొత్త ప్యాడ్‌ను విడుదల చేసింది. Realme Pad 2 పేరుతో భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ ప్యాడ్‌ గత సంవత్సవం విడుదలైన రియల్‌మీ ప్యాడ్‌ 1కు కొనుసాగింపు వెర్షన్‌. ఈ ప్యాడ్‌ 2 క్విడ్ స్పీకర్లుతో డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉంది. మరియు 2k IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది.

రియల్‌మీ ప్యాడ్ 2.. 11.5 అంగుళాల 2k స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 82.5 శాతం స్ర్రీన్‌ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్‌ బ్లూ లైట్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. డీసీ డిమ్మింగ్‌, 450nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ప్రీమియం ఫోటో క్వాలిటీ కోసం O1 ఆల్ట్రా విజన్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 200*1200 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.

Realme pad 2 tablet

రియల్‌మీ ప్యాడ్‌ 2 మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ట్యాబ్‌ 6GB, 8GB ర్యామ్‌, 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. మరియు అంతర్గత స్టోరేజీని పెంచుకొనేందుకు మైక్రోSD కార్డు స్లాట్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మీ ప్యాడ్‌2 ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ UI కస్టమ్‌ OS ఆధారంగా పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌ ముందు, వెనుక 8MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 8360mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. 4G లైట్‌, Wi-Fi 802.11 ac, బ్లూటూత్‌ 5.3, USB టైప్‌-C పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

Realme pad 2 tablet

రియల్‌మీ ప్యాడ్‌ 2 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 మరియు 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.22,999కు అందుబాటులో ఉండనుంది. రియల్‌మీ ప్యాడ్‌ 2 ఆగస్టు 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌కు వస్తుంది.

ఈ ప్యాడ్‌ ముందస్తు ఆర్డర్‌పై రూ.2000 తగ్గింపును ఇస్తున్నట్లు రియల్‌మీ ప్రకటించింది. ఈ ప్యాడ్‌ 2 ఫ్లిప్‌కార్ట్‌ సహా రియల్‌మీ వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. మరియు గ్రే, గ్రీన్ రంగుల్లో ఈ రియల్‌మీ ప్యాడ్‌ 2 లభిస్తుంది.

* రియల్‌మీ ప్యాడ్‌2 తోపాటు ఇవాళ రియల్‌మీ c53 స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల అయింది. ఈ ఫోన్‌ 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD డిస్‌ప్లే మరియు 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. యూనిసోక్‌ T612 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB ర్యామ్‌+128GB అంతర్గత స్టోరేజీ మరియు 6GB ర్యామ్‌+64GB అంతర్గత స్టోరేజీ రెండు వేరియంట్లను కలిగి ఉంటుంది. 12GB డైనమిక్‌ ర్యామ్‌ ఫీచర్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌ వెనుకవైపు B&W లెన్స్‌తోపాటు 108MP ప్రైమరీ కెమెరా, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా రియల్‌మీ UI T ఎడిషన్‌తో పనిచేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme pad 2 tablet launched in india at rs19,999 starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X