2k డిస్‌ప్లే, 8360mAh బ్యాటరీతో రియల్‌మి ప్యాడ్ 2 Wi-Fi.. విడుదల తేదీ ఖరారు.. వివరాలు..!
రియల్‌మి నుంచి త్వరలో భారత్‌లో రియల్‌మి ప్యాడ్ 2 వైఫై (Realme Pad 2 Wi-Fi Launch) వేరియంట్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ను రియల్‌మి P - సిరీస్ కూడా లాంచ్ చేయనుంది. ఈ రెండు ఉత్పత్తులు ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. ఈ రెండింటిని రియల్‌మి వెబ్ సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి ప్యాడ్ 2.. 120Hz సపోర్టుతో 2k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 8360mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ మెరుగైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రియల్‌మి ప్యాడ్ వైఫై గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రియల్‌మి ప్యాడ్ 2 Wi-Fi తోపాటు రియల్‌మి P1 5G సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు కూడా విడుదల కానున్నాయి. రూ.15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ ధర సెగ్మెంట్‌లో 120Hz రీఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే మరియు 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్‌ను కలిగి ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని రియల్‌మి తెలిపింది.
ఈ సిరీస్ TUV Rhenland eye Protection సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. P1 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటి 7050 SoC చిప్ సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెవెన్ లేయర్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అదే రియల్‌మి P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2160 PWM డిమ్మింగ్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైటెనెస్ మరియు ProXDR సపోర్టు, TUV సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 45W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
మెరుగైన ఫీచర్లు.. :
ఈ రియల్‌మి ప్రో మోడల్ మెరుగైన ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది. టెక్టైల్ ఇంజిన్ మరియు రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ సహా మరిన్ని ఫీచర్‌లతో లాంచ్ కానుంది. తడి చేతులతో కూడా టచ్ పనిచేసేలా ఈ ఫీచర్ వినియోగపడుతుంది. విడుదల సమయం మరింత దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








