Home
Tablets

రియల్‌మి నుంచి ట్యాబ్లెట్.. భారీ బ్యాటరీ, 2.8K డిస్‌ప్లే సహా సూపర్‌ ఫీచర్లు..?

రియల్‌మి నుంచి జనవరి నెలలో రియల్‌మి 16 ప్రో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు, బడ్స్‌ ఎయిర్ 8 విడుదల కానున్నాయి. అయితే రియల్‌మి నుంచి ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ కూడా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌ జనవరి 6 వ తేదీన లాంచ్‌ కానున్నాయి. ట్యాబ్లెట్‌ కూడా అదే రోజున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ ట్యాబ్లెట్ కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ వివరాలను వెల్లడించారు. డిస్‌ప్లే, బ్యాటరీ సహా అనేక వివరాలను లీక్‌ చేశారు. అయితే రియల్‌మి ఎటువంటి అధికారిక సమాచారాన్ని షేర్‌ చేయలేదు.

టిప్‌స్టర్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ 11.6 అంగుళాల LCD 2.8K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంటుందని తెలిపారు.

Realme Pad 3 Tablet

స్టైలస్ ఉచితం? :
రియల్‌మి ప్యాడ్‌ 3 ట్యాబ్లెట్‌ (Realme Pad 3) స్టైలస్‌, కీబోర్డును కూడా సపోర్టు చేస్తుంది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ట్యాబ్లెట్‌ను ముందుగా కొనుగోలు చేసిన యూజర్లు స్టైలస్‌ ను ఉచితంగా పొందుతారని తెలుస్తోంది.

భారీ బ్యాటరీ! :
బ్యాటరీ లైఫ్ పరంగా ఈ రియల్‌మి ట్యాబ్లెట్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 12,200mAh బ్యాటరీతో పనిచేస్తుందని టిప్‌స్టర్‌ వెల్లడించారు. ఈ ట్యాబ్లెట్ వైఫై, 5G వెర్షన్‌లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ 8GB ర్యామ్‌తో 128GB, 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ స్పేస్‌ గ్రే, షాంఫైన్ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఈ లీక్స్‌ పై రియల్‌మి స్పందించలేదు. మరియు అధికారికంగా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. త్వరలో సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ :
భారత్ మార్కెట్‌లో రియల్‌మి 16 ప్రో సిరీస్‌ త్వరలో విడుదల కానుంది. ఇటీవలే ఈ ఫోన్ డిజైన్‌ సహా కెమెరా వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుందని రియల్‌మి చెబుతోంది. రియల్‌మి 16 ప్రో, ప్రో ప్లస్ మోడల్స్‌ 200MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌తోపాటు ఇయర్‌బడ్స్‌ కూడా విడుదల కానున్నాయి. ఫోన్‌తోపాటు బడ్స్‌ డిజైన్‌ పట్ల ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా సౌకర్యవంతమైన డిజైన్‌ను కలిగి ఉంటాయని రియల్‌మి తెలిపింది. నావోటో ఫుకాసావా సహకారంతో రూపొందించారు.

రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 8 ఇయర్‌బడ్స్ స్మార్టర్‌ నాయిస్‌ మేనేజ్‌మెంట్, క్లియర్‌ వాయిస్‌ ఉండే విధంగా మెరుగైన ఫీచర్లు ఉంటాయని, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Pad 3 Tablet display battery camera tipped expected launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X