Redmi Pad 2 : 11 అంగుళాల డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో రెడ్‌మి ట్యాబ్లెట్.. ఎప్పుడు విడుదల కానుంది..?
రెడ్‌మి నుంచి మరో ట్యాబ్లెట్ భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించింది. రెడ్‌మి ప్యాడ్ 2 పేరుతో (Redmi Pad 2) అందుబాటులోకి రానుంది. ఈ నెల 5 న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెడ్‌మి ప్యాడ్ 2 భారీ డిస్‌ప్లేతోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మెరుగైన మల్టీమీడియా అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది.
సుమారు మూడేళ్ల తరువాత :
రెడ్‌మి ప్యాడ్.. అక్టోబర్ 2022 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది. సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మరో ఈ సిరీస్‌లో మరో ట్యాబ్లెట్‌ను రెడ్‌మి లాంచ్ చేస్తోంది. X పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను వెల్లడించలేదు.

మరో మూడు రోజుల్లో..? :
రెడ్‌మి ప్యాడ్ 2.. సంస్థ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్యానర్ ఆధారంగా జూన్ 5 వ తేదీన రెడ్‌మి ప్యాడ్ 2 గురించి కీలక వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్యాబ్లెట్ విడుదల చేస్తుందా లేదా ఈ ట్యాబ్లెట్ గురించి ముఖ్యమైన వివరాలను వెల్లడిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
స్టైలస్ సపోర్టు :
రెడ్‌మి ఇండియా X పోస్ట్ ఆధారంగా రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్.. స్టైలస్‌ను కూడా సపోర్టు చేస్తుంది. మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మి ప్యాడ్ 2 గ్లోబల్ మార్కెట్ టీజర్ ఆధారంగా ఈ ప్యాడ్ 4G కనెక్టివిటీ సపోర్టుతో అందుబాటులోకి వస్తుంది.
ట్యాబ్లెట్ అంచనా వివరాలు :
ఇప్పటికే ఈ ట్యాబ్లె్‌ట్ గురించి కొన్ని కీలక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేతో పనిచేసే అవకాశం ఉంది.
The #RedmiPad2 is on the way… and it’s #BuiltForMore.
— Redmi India (@RedmiIndia) June 2, 2025
More binge. More play. More power. More reasons to want one.
Launching soon. Stay tuned.
Know more: https://t.co/kbRSUEeV6L pic.twitter.com/OtsXI4aruO
భారీ బ్యాటరీ :
దీంతోపాటు బ్యాటరీ మరియు ఛార్జింగ్ పరంగా ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని లీక్స్ వచ్చాయి. కెమెరా విభాగం పరంగా AI ఆధారిత 8MP కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
రెడ్‌మి ప్యాడ్ 2 ధర అంచనా వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 229 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.22000), అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 279 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.26000) గా ఉంటుందని తెలుస్తోంది.
మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం రెడ్‌మి అప్‌కమింగ్ ట్యాబ్లెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 3.5mm హెడ్‌ఫోన్స్ జాక్ తోపాటు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications