మూడు సంవత్సరాల తర్వాత ఈ సంస్థ నుంచి కొత్త ట్యాబ్లెట్.. విడుదల తేదీ వెల్లడి.. పూర్తి వివరాలు..!
రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ (Redmi Pad 2) ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారత్ మార్కెట్ లోనూ విడుదల కానుంది. షియోమీ తాజా ప్రకటన ఆధారంగా ఈ ప్యాడ్ భారత్ లో జూన్ 18 వ తేదీన అందుబాటులోకి రానుంది. రెడ్‌మి ప్యాడ్ 2 వైఫై, సెల్యూలర్ వేరియంట్స్ లో విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా స్లీక్ మెటల్ బాడీని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఈ ట్యా్బ్లెట్ కు సంబంధించిన అనేక వివరాలు లీక్ అయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి ప్యాడ్ ట్యాబ్లెట్ 2022 సంవత్సరంలో విడుదల అయింది. సుమారు సంవత్సరాల తర్వాత జూన్ 18 న రెడ్‌మి ప్యాడ్ 2 విడుదల అవుతోంది. తాజాగా ఈ ట్యాబ్లెట్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ స్టైలస్ ను కూడా సపోర్టు చేస్తుంది.

డ్‌మి ప్యాడ్ 2 డిస్‌ప్లే అంచనా వివరాలు :
ఈ రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేతో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు యూరప్ లిస్టింగ్ ఆధారంగా ఈ ట్యాబ్లెట్ డిస్‌ప్లే 600 నిట్స్ బ్రైట్‌నెస్ తో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
చిప్‌సెట్, కెమెరా వివరాలు :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా SoC చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారీ బ్యాటరీ..! :
రెడ్‌మి ప్యాడ్ 2.. 18W ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు 3.5mm హెడ్‌ఫోన్స్ జాక్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. మెరుగైన ఆడియో కోసం క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ 4G కనెక్టివిటీ మోడల్ లో లభిస్తుంది.
రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ ధర వివరాలు! :
యూరోపియన్ లిస్టింగ్ ఆధారంగా రెడ్‌మి ప్యాడ్ 2 (వైఫై) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19395 గా ఉండే అవకాశం ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ 4G వేరియంట్ ధర రూ.22320 గా ఉండే అవకాశం ఉంది.
భారత్ మార్కెట్ లో విడుదల అనంతరం రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ ను mi.com తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. గ్లోబల్ టీజర్ ఆధారంగా రెడ్‌మి ప్యా్డ్ 2 ట్యాబ్లెట్ మింట్ గ్రీన్, గ్రే కలర్ వేరియంట్స్ లో విడుదల అవుతుంది. అయితే వైఫై వేరియంట్ మొత్తంగా మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో వైలెట్, గ్రే, గ్రీన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications