రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ (Redmi Pad 2 Pro 5G) భారత్ మార్కెట్‌లో జనవరి 6 వ తేదీ 2026 న లాంచ్ కానుంది. ఇదే రోజు రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ల్యాండింగ్ పేజీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని ఆధారంగా అనేక వివరాలు వెల్లడయ్యాయి.
రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ ట్యాబ్లెట్ ఇండియన్ వేరియంట్ ఇటీవలే గీక్‌బెంచ్ డేటాబేస్ తో లిస్టింగ్ అయింది. అయితే ఈ లిస్టింగ్ ఆధారంగా భారత్ వేరియంట్ కూడా గ్లోబల్ వేరియంట్ చిప్‌సెట్ లోనే అందుబాటులోకి వస్తుంది.

ఈ చిప్‌తోనే విడుదల కానుందా? :
గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా ఈ ట్యా్బ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఈ ట్యాబ్లెట్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలిసింది. ప్రస్తుత వివరాల ఆధారంగా ఈ ట్యాబ్లెట్ 12,000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
రానున్న 5 రోజుల్లో :
ఈ రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ కీబోర్డు, స్టైలస్ ను సపోర్టు చేస్తుంది. అయితే ట్యాబ్లెట్ డిస్‌ప్లే, కనెక్టివిటీ, స్పీకర్లు, డ్యూరబిలిటీ, డిజైన్ వంటి వివరాలను రానున్న 5 రోజుల్లో వెల్లడిస్తామని చెబుతోంది. దీంతోపాటు ధర వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది.
ట్యాబ్లెట్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ కూడా :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 15 5G Smartphone) గురించి కూడా ఇటీవల అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుందని సమాచారం.
అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే తో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రాటెక్షన్ ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.
108MP ప్రైమరీ, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 ధరకు లాంచ్ కానుందని చెప్పారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








