Home
Tablets

ఇవాళ్టి నుంచే 12000mAh భారీ బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లే ట్యాబ్లెట్‌ సేల్‌.. రూ.2000 డిస్‌ప్లే!

భారత్‌ మార్కెట్‌ లో షియోమీ సంస్థ ఇటీవల రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ (Redmi Pad 2 Pro 5G Tablet Sale) విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్‌ 12.1 అంగుళాల భారీ డిస్‌ప్లే, 12000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. వైఫై, 5G కనెక్టివిటీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రెడ్‌మి ట్యాబ్లెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, సేల్ వివరాలు.

రూ.2000 డిస్కౌంట్ :
రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. Mi.Com, షియోమీ రిటైల్‌ స్టోర్స్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి వెబ్‌సైట్‌ లో ICICI బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. అదే ఫ్లిప్‌కార్ట్‌ లో SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Redmi Pad 2 pro 5G Tablet sale today

ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) ధర రూ.22999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 5G) ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + 5G) వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. గ్రే, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటుంది.

భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ :
రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ట్యాబ్లెట్ 12.1 అంగుళాల 2.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 12000mAh బ్యాటరీని కలిగి ఉంది. 27W వైర్‌ రివర్స్ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రెడ్‌మి ప్యాడ్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్‌ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

Redmi Pad 2 pro 5G Tablet sale today

13MP కెమెరా :
ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్‌ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు గైరో స్కోప్, యాక్సెలిరోమీటర్‌, ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, కలర్ టెంపరేచర్‌ సెన్సర్‌, హాల్‌ సెన్సర్‌ లు ఉన్నాయి.

* ఈ ట్యాబ్లెట్‌తోపాటే రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌ సేల్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. ఫోన్‌ ప్రారంభ ధర రూ.22999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Pad 2 pro 5G Tablet with large battery, 12000mAh battery sale to start from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X