Home
Tablets

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ, డిస్‌ప్లేతో రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌.. ధర వివరాలు లీక్‌!

రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ (Redmi Pad 2 Pro 5G Tablet) భారత్‌ మార్కెట్‌లో జనవరి 8 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. షియోమీ ఇండియా మైక్రోసైట్‌ ఆధారంగా ఈ సమాచారం తెలిసింది. తాజాగా ఈ ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలతోపాటు ధర వివరాలు వెల్లడయ్యాయి. మెరుగైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 12000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

Redmi Pad 2 pro 5G Tablet with snapdragon Pad 2 Pro 5G Tablet price leaked in india

క్వాడ్‌ HD+ డిస్‌ప్లే! :
ఈ ట్యాబ్లెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్తో 12.1 అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ సపోర్టుతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రెడ్‌మి ప్యాడ్‌ ట్యాబ్లెట్‌ 7.5mm థిక్‌నెస్‌తో 610 గ్రాముల బరువును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ట్యాబ్లెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆడియో పరంగా డాల్బీ అట్మాస్‌, వాల్యూమ్ బూస్ట్‌ ఫీచర్‌ సపోర్టుతో క్వాడ్‌ స్పీకర్‌ సపోర్టును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్‌ జనవరి 6 వ తేదీన విడుదల కానుంది. సుమారుగా జనవరి రెండు లేదా మూడో వారంలో ఈ ట్యాబ్లెట్‌ సేల్‌ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఇతర ఇ-కామర్స్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది? :
టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ఆధారంగా ఈ ట్యాబ్లెట్‌ Wi-Fi వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర సుమారుగా రూ.25000 గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే షియోమీ కూడా ఈ ట్యాబ్లెట్‌ రూ.20 వేల నుంచి రూ.30 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని చెబుతోంది.

పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ :
భారత్‌ మార్కెట్‌ లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ డిసెంబర్ తొలి వారంలో విడుదల అయింది. 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని చెబుతోంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Pad 2 pro 5G Tablet with snapdragon Pad 2 Pro 5G Tablet price leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X