రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ టీజర్ లాంచ్.. డిజైన్ సహా కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
భారత్ మార్కెట్‌లో షియోమీ ఇటీవలే రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే త్వరలో రెడ్‌మి నుంచి ట్యాబ్లెట్ విడుదల కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల అయింది. రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో (Redmi Pad 2 Pro Tablet) పేరుతో ఈ ట్యాబ్లెట్ లాంచ్ కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
గ్లోబల్ వేరియంట్ :
గ్లోబల్ మార్కెట్‌లో రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో ట్యాబ్లెట్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. అయితే త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న వేరియంట్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. తాజా టీజర్ ఆధారంగా ఈ ట్యాబ్లెట్‌పై ప్రో బ్రాండింగ్‌ను గమనించవచ్చు.

గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రెడ్‌మి ప్రో 2 ప్రో ట్యాబ్లెట్ గ్లోబల్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 12.1 అంగుళాల LCD 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌తో పనిచేస్తోంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
భారీ బ్యాటరీ :
ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ వేరియంట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది. బ్లూటూత్ 5.4, వైఫై 6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Time to close a few windows.
— Redmi India (@RedmiIndia) December 18, 2025
A better view is coming with REDMI *** 2 *** 5G.#ProComingSoon pic.twitter.com/Qenq20drOo
ఇటీవలే లాంచ్ అయిన రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఇటీవలే రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12499 గా ఉంది.
రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 810 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా అమర్చి ఉంది. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
రెడ్‌మి 15c 5G స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్ ఫీచర్ కూడా ఉంది. సెక్యురిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








