రూ.13999 కే 11 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ ట్యాబ్లెట్.. రూ.1000 డిస్కౌంట్..!
Redmi Pad 2 Launched : రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. వైఫై, వైఫై + సెల్యూలర్ వేరియంట్స్‌లో లాంచ్ చేశారు. ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది. రెడ్‌మి ప్యాడ్ 2022 తో లాంచ్ కాగా.. మూడు సంవత్సరాల తర్వాత తర్వాత వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
రెడ్‌మి ప్యాడ్ 2 పూర్తి వివరాలు :
రెడ్‌మి ట్యాబ్లెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల 2.5K క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లేతో విడుదల అయింది. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఉపయోగించుకోవచ్చు.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2.0 ను కలిగి ఉంది. గూగుల్ జెమిని AI, సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
8MP కెమెరా. 9000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి ప్యాడ్ 2 వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. అదే ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్ 5.3, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ స్మార్ట్ పెన్‌ను కూడా సపోర్టు చేస్తుంది.
ఈ ట్యాబ్లెట్ హాల్ సెన్సార్, యాక్సెలిరో మీటర్, వర్చువల్ యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే Eye ప్రొటెక్షన్ కోసం ట్రిపుల్ TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 510 గ్రాముల బరువు ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) ధర రూ.13,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 4G) ధర రూ.15,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + 4G) ధర రూ.17,999 గా ఉంది. ఈ ట్యాబ్లెట్ బ్లూ, గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
#RedmiPad2 is #BuiltForMore, and here’s what you get.
— Redmi India (@RedmiIndia) June 18, 2025
✅ Big 27.94cm (11) display
✅ Massive 9000mAh battery
✅ Redmi Smart Pen support
✅ Cellular connectivity
✅ AI feature like Circle To Search
Starting at ₹12,999*
Sale goes live on 24th June.https://t.co/z526U9Ggd2 pic.twitter.com/HMSAbajTLp
ఈ రెడ్‌మి ప్యాడ్ 2 సేల్ జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. HDFC క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రెడ్‌మి స్మార్ట్ పెన్, రెడ్‌మి ప్యాడ్ 2 కవర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెన్ ధర రూ.3999, కవర్ ధర రూ.1299 గా ఉంది.


Click it and Unblock the Notifications