రూ.12999 కే 9000mAh బ్యాటరీ, 11 అంగుళాల డిస్‌ప్లే ట్యాబ్లెట్.. ఇవాళ్టి నుంచే సేల్..!
భారత్ మార్కెట్‌లో రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ గత వారం లాంచ్ అయింది. బడ్జెట్ ధరలోనే ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు. ఈ ప్యాడ్ వైఫై, వైఫై + సెల్యూలర్ వేరియంట్స్‌లో విడుదల చేసింది. బడ్జెట్ రేంజ్‌లో ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఈ రెడ్‌మి ప్యాడ్ 2 మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్యాడ్ స్మార్ట్ పెన్‌ను కూడా సపోర్టు చేస్తుంది.
రెడ్‌మి ప్యాడ్ 2 సేల్ వివరాలు :
రెడ్‌మి ప్యాడ్ 2 (Redmi pad 2 Sale) ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర భాగస్వామ్య స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ గ్రే, బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

తొలిసేల్‌లో భాగంగా డిస్కౌంట్ :
రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi) ధర రూ.13,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 4G) ధర రూ.15,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + 4G) ధర రూ.17,999 గా ఉంది. సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్ కార్డుతో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
స్మార్ట్ పెన్, కవర్ ధర :
ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ స్మార్ట్ పెన్‌ను సపోర్టు చేస్తుంది. అయితే స్మార్ట్ పెన్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని రెడ్‌మి తెలిపింది. దీని ధర రూ.3999 గా ఉంటుందని తెలిపింది. అదే రెడ్‌మి ట్యాబ్లెట్ కవర్‌ను రూ.1299 ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

రెడ్‌మి ప్యాడ్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి ప్యాడ్ 2.. 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2.0 పైన పనిచేస్తుంది.
చిప్‌సెట్, AI ఫీచర్‌ల వివరాలు :
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ గూగుల్ జెమిని AI, సర్కిల్ టూ సెర్చ్ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

9000mAh బ్యాటరీ :
ఈ ట్యా్బ్లెట్ వైఫై, వైఫై + సెల్యూలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి ట్యాబ్లెట్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరాను అమర్చారు. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 4G, WiFi 5, బ్లూటూత్ 5.3, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్వీకర్ సిస్టమ్‌ను అమర్చారు. యాక్సెలిరోమీటర్, హాల్ సెన్సార్, వర్చువల్ యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఈ ట్యాబ్లెట్ వెట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ వినియోగించుకొనేందుకు వీలుంటుంది. ఉపయోగించుకోవచ్చు. మరియు Eye ప్రొటెక్షన్ కోసం ట్రిపుల్ TUV Rheinland సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ రెడ్‌మి ప్యాడ్ 2 ట్యాబ్లెట్ 510 గ్రాముల బరువు ఉంది.


Click it and Unblock the Notifications