Home
Tablets

తక్కువ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నారా.. 11 అంగుళాల డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో రెడ్‌మి ట్యాబ్లెట్‌..!

రెడ్‌మి సంస్థ ఈ సంవత్సరం జూన్‌ నెలలో రెడ్‌మి ప్యాడ్‌ 2 ట్యాబ్లెట్‌ ను లాంచ్ చేసింది. వైఫై, సెల్యూలర్ వేరియంట్స్‌లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ స్మార్ట్‌ పెన్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్న వారికి ఈ ట్యాబ్లెట్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ రెడ్‌మి ప్యాడ్ 11 అంగుళాల డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

రెడ్‌మి ప్యాడ్‌ 2 (Redmi Pad 2 Tablet) ప్రస్తుతం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లోనూ ఈ ట్యాబ్లెట్‌ అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ గ్రే, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో ప్రస్తుతం లభిస్తోంది.

Redmi Pad 2 tablet price on flipkart

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ట్యాబ్లెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi వేరియంట్) ధర రూ.13,919, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ (Wi-Fi + 4G వేరియంట్) ధర రూ.15,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi + 4G వేరియంట్‌) ధర రూ.17,999 గా ఉంది.

11 అంగుళాల డిస్‌ప్లే :
రెడ్‌మి ప్యాడ్‌ 2 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు ఎక్కువ సమయం వినియోగించినా కంటికి హాని కలగకుండా ఉండేలా ట్రిపుల్‌ TUV Rheinland సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ రెడ్‌మి ట్యాబ్లెట్‌ గూగుల్‌ జెమిని, సర్కిల్‌ టూ సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 15 OS :
రెడ్‌మి ప్యాడ్‌ 2 ట్యాబ్లెట్‌ మీడియాటెక్ హీలియో G100 అల్ట్రా SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS 2.0 పైన పనిచేస్తోంది.

9000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ట్యాబ్లెట్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 9000mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో క్వాడ్‌ స్వీకర్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి ప్యాడ్‌ 2 ట్యాబ్లెట్‌ కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక సెన్సర్‌లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, హాల్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌ ఉన్నాయి.

రెడ్‌మి ప్యాడ్ స్మార్ట్‌ పెన్‌ (Smart Pen) ను సపోర్టు చేస్తుంది. అయితే ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కవర్‌ కావాలని భావిస్తే, దానికి కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ బరువు 510 గ్రాములుగా ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Pad 2 tablet with 11 inch display now available at Rs13999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X